సీఐఎస్ఎఫ్ 1149 కానిస్టేబుల్ , ఫైర్ ఖాళీల భర్తీకి ప్రకటన
సీఐఎస్ఎఫ్ 1149 కానిస్టేబుల్ , ఫైర్ ఖాళీల భర్తీకి ప్రకటన
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ 1149 కానిస్టేబుల్ / ఫైర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది .
పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు .
ఎంపిక విధానం : ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ) / ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పీఎన్డీ ) , రాత పరీక్ష ఓఎంఆర్ / కంప్యూ టర్ బేస్డ్ టెస్ట్ ( సీబీటీ ) ఉంటాయి .
వీటిల్లో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు . రాత పరీక్ష ఓఎంఆర్ విధానంలో ఇంగ్లిష్ , హిందీ భాషల్లో ఉంటుంది . పరీక్షల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ , ఆయా రాష్ట్రాలవారీగా ఉన్న ఖాళీల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు . పరీక్షల వివిధ దశల్లో అడ్మిట్ కార్డును ఆన్లైన్ ద్వారానే జారీచేస్తారు . పోస్టు ద్వారా పంపించారు . కాబట్టి అభ్యర్థులు వెబ్సైట్ను తరచూ చూస్తుండాలి .
అడ్మిట్ కార్డును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి .
ఖాళీల వివరాలు : మొత్తం 1149 పోస్టుల్లో ఆంధ్రప్రదే శ్కు 79 , తెలంగాణకు 30 కేటాయించారు . మొత్తం పోస్టుల్లో 10 శాతాన్ని మాజీ సైనికోద్యోగులకు రిజర్వ్ చేశారు . ఎంపికైన అభ్యర్థులను దేశంలో ఎక్కడైనా నియమించవచ్చు .
అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ. చెస్ట్ 80-85 సెం.మీ. ఉండాలి .
కొన్ని రాష్ట్రాలకు చెందిన వ్యక్తు లకు ఎత్తు విషయంలో మినహాయింపులు ఉంటాయి .
అర్హత : ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి .
వయఃపరిమితి : 18-23 సంవత్సరాలు ఉండాలి . 05.03.99 కంటే ముందు 04.03.2004 తర్వాత జన్మించినవారు అనర్హులు .
ఎస్సీ , ఎస్టీ , ఓబీసీ , ఎక్స్ - సర్వీస్మెన్లకు వయఃపరిమితిలో రిజర్వేషన్లు వర్తి స్తాయి . దరఖాస్తు రుసుము : రూ .100 . ఆన్లైన్ ద్వారా చెల్లించాలి . ఎస్సీ , ఎస్టీ , మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది . దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి . దరఖాస్తులకు చివరి తేది : 04.03.2022
వెబ్సైట్ : CLICK HERE
Comments
Post a Comment