టెట్ బెస్ట్ స్కోర్ సాధించడమెలా ?

బోధన అనేది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే పవిత్ర కార్యం ' . ఇట్టి పవిత్ర కార్యాన్ని నిర్వర్తించడానికి అధిగమించాల్సిన మొదటి మెట్టు టెట్ . రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది . ఈ నేపథ్యంలో టెట్లో బెస్ట్ స్కోర్ సాధించడమెలాగో తెలుసుకుందాం .



• విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి , ఎన్సీ టీఈ నిబంధనల మేరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయా లంటే టెట్ ( టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) లో అర్హత సాధించడం తప్పనిసరి 
• డీఎస్సీ సాధనలో టెట్ పాత్ర : గతంలో టెట్ రాసిన అభ్యర్థులు స్కోరు పెంచుకోవడం కోసం మళ్లీ రాయాలి . టెట్ను కేవలం అర్హత పరీక్షగా మాత్రమే కాకుండా పోటీ పరీక్షగా భావించాలి . టెట్ పొందే ప్రతి మార్కు డీఎస్సీలో ర్యాంకును మెరుగుపరుస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దు . ఉపాధ్యాయ కల నెరవేరాలంటే టెట్లో మంచి స్కోర్ సాధించాలి . 

• సిలబస్ అనాలసిస్
చైల్డ్ డెవలప్మెంట్ ( సైకాలజీ ) లో పెరుగు దల వికాసం , వికాస నియమాలు , అభ్యసన సిద్ధాంతాలు , వైయక్తిక భేదాలు , మూర్తి మత్వం , పెడగాగీకి సంబంధించిన విద్యా హక్కు చట్టం , జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం మొదలైనవి అవగాహనాత్మకంగా అధ్య యనం చేయాలి . . 

లాంగ్వేజ్ -1 , లాంగ్వేజ్- 2 లకు సంబం ధించి తెలుగు , ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఉత్తమంగా స్కోర్ చేయడానికి నిర్దేశించిన పాఠ్యపుస్తకా ల్లోని వ్యాకరణాంశాలు లేదా సవరణలపై దృష్టి పెట్టాలి . 

•కంటెంట్లో ప్రధానంగా గణితానికి సంబంధించి సంఖ్యామానం , భిన్నాలు , లాభన ష్టాలు , నిష్పత్తి - అనుపాతం , కాలం - పని , రేఖాగణితం , దత్తాంశ విశ్లేషణ మొదలైనవి . బాగా అధ్యయనం చేయాలి . 
• సైన్స్ కంటెంట్లో మొక్కలు - జంతువులు , ఆహారం , గాలి , నీరు , శక్తి , మానవ శరీరం ముఖ్యమైనవి . సోషల్ కంటెంట్ మన దేశం , మనరాష్ట్రం , రాజ్యాంగం , సాంఘిక శాస్త్ర ఇతివృత్తాలు , మొదలైన వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి .
• ప్రతీ కంటెంట్ సబ్జెక్ట్ పాటు దాని బోధనా విధానాలకు సంబంధించిన పెడగాగీ ( మెథ డాలజీ ) అంశాల్లో లక్ష్యాలు - స్పష్టీకరణలు , బోధనా ఉపగమాలు , విద్యా ప్రమాణాలు , అభ్యసన , సుగుణాలు , టీఎల్ఎం , మూల్యాంకనం , ప్రణాళికలు , ఆయా సబ్జె క్టుల చరిత్ర , స్వభావాలు , పరిధి క్షుణ్ణంగా చదవాలి .

12 రోజుల సమయం 

• నోటిఫికేషన్ వెలువడింది . వెలువడింది . దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది . దాదాపు నెల రోజుల సమయం ఉంది . కాబట్టి ప్రణాళికా బద్ధంగా సిద్ధం కావడం చాలా అవసరం . 
• గణితం , ఇంగ్లిష్ సబ్జెక్టులకు అధిక సమయం కేటాయిస్తూ ప్రాక్టీసు ప్రాధాన్యం ఇవ్వాలి . అకాడమీ పుస్తకాలు చదువుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకొని , రివిజన్ చేస్తూ ఉండాలి . 
• చిన్న తరగతుల్లోని అంశాలు పెద్ద తరగ తుల్లో పునరావృతమైనప్పుడు సంబంధం ఏర్పరుస్తూ సాధన ఉండాలి .
• క్లిష్టమైన , నిగూఢమైన అంశాలను చదువు తున్నప్పుడు పట రూపంలో గానీ పట్టికల రూపంలో గానీ పొందుపరిచి చదువుకో వాలి . మరింత అవగాహన కోసం , బృంద అధ్యయనం అవసరం . సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సూచనలు పాటించాలి .

-బాలరాజు 
విషయ నిపుణులు
వికారాబాద్

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..