పోలీసు ఉద్యోగాల రాత‌ప‌రీక్ష‌లో.. క‌రెంట్ అఫైర్స్‌, జీకే పాత్ర‌

తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే 17000 ఉద్యోగాల‌కు పైగా పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ రానున్న‌ది.
ఈ నేప‌థ్యంలో.. పోలీసు ఉద్యోగాల రాతప‌రీక్ష‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. తీవ్ర పోటీ ఉన్న ఈ పరీక్షలో విజయం సాధించాలంటే.. జీకేతో పాటు వర్తమాన వ్యవహరాలపై దృష్టిసారించాలి.

జీకేకు సంబంధించి చదవాల్సిన అంశాలు ఇవే..

భారతదేశ జాతీయ చిహ్నాలు, కేలండర్, జనాభా, భాషలు, రాష్ట్రాలు, రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాలు, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, సమాచార వ్యవస్థ, దేశ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థ, భారత అంతరిక్ష విజయాలు, అణుశక్తి రంగం, అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు, అవి నెలకొని ఉన్న ప్రదేశాలు, భారత భౌగోళిక అంశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, భారత రాజ్యాంగంలోని ముఖ్యాంశాలు.

➤ రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, న్యాయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు, బ్యాంకింగ్ వ్యవస్థ, ఉపాధి కల్పనా పథకాలు, వ్యవసాయ రంగం తదితర అంశాలపై దృష్టిసారించాలి.
➤ అంతర్జాతీయ అంశాలలో దేశాలు, రాజధానులు, కరెన్సీలు, పార్లమెంటు పేర్లు, వివిధ దేశాల జాతీయ చిహ్నాలు, పుష్పాలు, జంతువులు, భౌగోళిక మారుపేర్లు, నదీ తీరాన వెలసిన నగరాలు, అత్యున్నత అంశాలు, ప్రసిద్ధ కట్టడాలు, ప్రదేశాలు, సరస్సులు, జలపాతాలు, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలు, కూటములు వంటి వాటిని చదవాలి.
➤ గ్రంథాలు-రచయితలు; ప్రముఖ ఆవిష్కరణలు-ఆవిష్కర్తలు; ప్రముఖ వ్యక్తుల బిరుదులు, నినాదాలు, వివిధ అధ్యయన శాస్త్రాలు, కల్చర్స్, జాతీయ, అంతర్జాతీయ దినాలు, ప్రపంచ సంస్థల ప్రధాన కార్యాలయాలు, వాటి ప్రస్తుత అధిపతులు, రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, భౌగోళిక విషయాలను చదవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
➤ కరెంట్ అఫైర్స్‌లో ప్రపంచంలో ఏ మూల జరిగిన సంఘటన నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. దీనికి నిర్దేశిత సిలబస్ అంటూ ఉండదు. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన సంఘటనలను అధ్యయనం చేయాలి. రోజూ ఒకట్రెండు ప్రామాణిక వార్తా పత్రికలను చదివి, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. మార్కెట్లో పేరున్న ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్‌ను కూడా చదవాలి.

కరెంట్ అఫైర్స్- ప్రధాన అంశాలు:
☛ రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలు
☛ రాజకీయ సంఘటనలు, ఎన్నికలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు
☛ వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు
☛ వాణిజ్య వ్యవహారాలు
☛ శాస్త్ర, సాంకేతిక అంశాలు
☛ పర్యావరణం
☛ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు
☛ క్రీడలకు సంబంధించిన పోటీలు, విజేతలు, ఇతర ముఖ్యమైన సమాచారం
☛ అంతర్జాతీయ సదస్సులు
☛ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు
☛ ఆర్థిక సర్వేలు, రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్, రాష్ట్ర‌ బడ్జెట్

ప్రిప‌రేష‌న్ ఎలా కావాలంటే..?
గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళిని, క్లిష్టతను పరిశీలించాలి. వాటికి అనుగుణంగా సిద్ధంకావాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను బిట్లను చదవడానికే పరిమితం చేయకూడదు. ఒక ముఖ్య ఘటన జరిగినప్పుడు దాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. అప్పుడే సంబంధిత అంశం నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా సమాధానం గుర్తించగలరు.

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..