నిరుద్యోగులకు ఊరట || TSPCS కీలక నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80,000 ఉద్యోగాలకు పైగా ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించింది . 
ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ( TSPSC ) వద్ద ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ ( ఓటీఆర్ ) చేసుకున్న 25 లక్షల మంది నిరుద్యోగుల్లో అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య . 
తాజా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థుల స్థానికతను గుర్తించేందుకు ఉద్యోగాల నోటిఫికేషను ముందే టీఎస్పీఎస్సీ ఈ ప్రక్రియను ప్రారంభించింది . 1 7 తరగతుల్లో చివరి నాలుగేళ్లు ( 4-7 తరగతులు ) చదివిన జిల్లానే స్థానికంగా పరిగణిస్తారు . గతంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో లోకల్ , నాన్కల్ అని కేవలం ప్రస్తావించేవారు . ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉండేది . ఈసారి ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సమర్పించాల్సి రావడం , స్థానికతను గుర్తించేందుకు బోనఫైడ్ సర్టిఫికె ట్లే కొలమానం కావడంతో వీటి కోసం నిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు .

అభ్యర్థులకు ఊరట ... 

ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకొంది . వన్లైం రిజిస్ట్రేషన్ ( ఓటీఆర్ ) లో సర్టిఫికెట్ల అప్డేషన్ తప్పనిసరి కాదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది . ఈ మేరకు వెబ్సైట్లో మార్పులు కూడా చేసింది . ఓటీఆర్లో విద్యార్హత వివరాలు నమోదు చేస్తే సరిపోతుందని .. సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం అభ్యర్థుల ఇష్టమని తెలిపింది . సర్టిఫికెట్ అప్లోడ్ చేయకున్నా .. ఓటీఆర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుందని స్పష్టం చేసింది . దీనిపై నిరుద్యోగల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది . అయితే ఉద్యోగంలో చేరే సమయంలో ఒరిజినల్స్ చూపించాల్సి ఉంటుంది .

కొత్తగా ప్రిపరేషన్ బుక్స్ .

చాలా కాలంగా పరీక్షలు లేకపోవడం .. ప్రభుత్వం వెంటనే ఖాళీల భర్తీకి ముందుకు రావడంతో మార్కెట్ ( Market ) లో పుస్తకాల కొరత ఏర్పాడింది . ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ , పోటీ పరీక్షల నేపథ్యంలో కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగు అకాడమీ కసరత్తు చేస్తున్నది . డిమాండ్ ఉన్న 15 రకాల పుస్తకాల పునర్ముద్రణకు చర్యలు చేపట్టింది . ప్రతి ఏటా రూ .20 కోట్లకుపైగా వెచ్చించి తెలుగు అకాడమీ పుస్తకాలను ముద్రిస్తుండగా , ఈ సారి అదనంగా రూ . 5 నుంచి 10 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు . ముఖ్యంగా ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్ -1 , గ్రూప్ - 2 , పోలీసు , టీచర్ ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం ఉంది . వారంతా తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలనే ఎంపిక చేసుకొంటారు . ఈ పుస్తకాలనే ప్రశ్నపత్రాల రూపకల్పనకు ప్రామాణికంగా తీసుకొంటారన్న అభిప్రాయం అందరిలో ఉంది . ఈ నేపథ్యంలో నెలాఖరులోగా పుస్తకాలను అందుబాటులో తీసుకురావాలని అధికారులు కృషి చేస్తున్నారు .

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..