వరంగల్‌ 'నిట్'లో 100 టీచింగ్ ఫ్యాకల్టీలు, పోస్టుల వివరాలు ఇలా! అర్హతలివే! ఇలా అప్లై చేసుకోండి

 దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో వరంగల్ లోని నిట్ (నేషనల్ ఇనిస్ట్యూట్ ఇఫ్ టెక్నాలజీ) ఒకటన్న విషయం తెలిసిందే. ఈ పేరొందిన విద్యాసంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది

 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.



 వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 27న ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది. 

వివరాలు..
మొత్తం ఖాళీలు: 100

పోస్టుల కేటాయింపు: జనరల్-38, ఈడబ్ల్యూఎస్-18, ఓబీసీ-26, ఎస్సీ-10, ఎస్టీ-08.

పోస్టుల వారీగాఖాళీలు..

➥ ప్రొఫెసర్: 12

➥ అసోసియేట్ ప్రొఫెసర్: 52. 

➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-I): 13.

➥అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-II): 14.

➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-II): 9.




విభాగాలవారీగా ఖాళీలు: సివిల్ ఇంజినీరింగ్ - 16, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 06, మెకానికల్ ఇంజినీరింగ్ - 05, ఈసీఈ - 11, మెటలర్జికల్ ఇంజినీరింగ్ - 08, కెమికల్ ఇంజినీరింగ్ - 08, సీఎస్ఈ - 26, బయోటెక్నాలజీ - 04, మ్యాథమెటిక్స్ - 04, ఫిజిక్స్ - 04, హ్యుమానిటిస్ - 01, ఎస్‌వోఎమ్ - 06, సీసీపీడీ - 01.   

అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీటెక్/ బీఈ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్/ ఎంఎస్సీ/ పీజీ/ ఎంఏ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 35-50 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైనతేదీలు..

 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.12.2022.

 దరఖాస్తు చివరి తేది: 25.01.2023.

ముఖ్యమైన  లింక్స్ 


Notification 

Online Application

Website 

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

RTC లో 813 కండక్టర్ పోస్టులు భర్తీ .. మంత్రి పొన్నం ప్రభాకర్