నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.1.50 లక్షల వేతనంతో ఉద్యోగాలు..

నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. నెలకు రూ.1.50 లక్షల వేతనంతో ఉద్యోగాలు..




జపాన్ లో(Japan) నర్సింగ్ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి తెలంగాణరాష్ట్ర విదేశీ మానవ వనరుల సంస్థ(టామ్‌కామ్‌) దరఖాస్తులు కోరుతోంది. దీనిలో నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమాలో ఉత్తీర్ణులైన వారికి శిక్షణ ద్వారా విదేశీ ఉద్యోగాలను కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. అభ్యర్థుల యొక్క వయస్సు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. అయితే వీటికి సంబంధించి మొదటి విడత ఎంపిక పూర్తి కాగా.. డిసెంబర్ 27 నుంచి వారికి టీఎస్ఐఆర్డీ(TSIRD), రాజేంద్రనగర్, హైదరాబాద్ లో శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. అంటే ఈ రోజు  నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభం అవుతుంది

విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు ఉండాల్సిన అర్హతలపై అవగాహన, శిక్షణ ఈ ప్రోగ్రామ్ లో కల్పించనున్నారు. దీనిలో జపనీస్ భాషపై శిక్షణతో పాటు ఇతర వృత్తిపరమైన నైపుణ్యాలను కల్పించనున్నారు. రెండో విడత దరఖాస్తుల్లో భాగంగా.. దరఖాస్తులు సమర్పించిన వారికి రేపు (డిసెంబర్ 27) స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేయనున్నారు.


ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య వేతనం ఇవ్వబడుతుంది. వీటికి సంబంధించి పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ www.tomcom.telangana.gov.in లేదా TOMCOM యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని యువతకు విదేశాలలో మరిన్ని ఉపాధి అవకాశాలు (Jobs) కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులతో సమావేశమై చర్చించారు. శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం, విదేశాలలో ఉద్యోగ మార్కెట్‌ను మెరుగుపరచుటకు తెలంగాణ ఓవర్ సీస్ మ్యాన్ పవర్ కంపెనికి (TOMCOM) ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. విదేశాల్లో ఎక్కువ మంది నర్సింగ్ విద్యార్థులు (Nursing Students) పరీక్షలు రాసేందుకు వీలుగా వ్యూహాన్ని రూపొందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.

ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో నర్సింగ్‌ కోర్సు చదువుతున్న విద్యార్థులందరికీ మోటివేషనల్‌ క్యాంపులు నిర్వహించి విదేశాల్లో ఉద్యోగావకాశాల గురించి వివరించాలని ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న టెక్నికల్ కోర్సుల జాబితాను షార్ట్‌ లిస్ట్ రూపొందించాలన్నారు. ఈ విధంగా అధికారుల ఆదేశాలతో.. నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను చూపుతోంది టామ్ కామ్.

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

RTC లో 813 కండక్టర్ పోస్టులు భర్తీ .. మంత్రి పొన్నం ప్రభాకర్