తెలంగాణలో 783 గ్రూప్‌-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

 తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ (TSPSC Group-2) విడుదలైంది. 




మొత్తం 783 గ్రూప్-2 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 18 నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి కొద్ది సేపట్లో ఇందుకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ (TSPSC Notification) విడుదల కానుంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 16 వరకు గడువు ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఆ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలు, నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను సందర్శించాలని టీఎస్పీఎస్సీ సూచించింది.




80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు.. రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఆయా నియామక సంస్థలు విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి నిత్యం ఏదో ఓ నోటిఫికేషన్ గురించి అప్డేట్స్ వస్తున్నాయి. నిన్న కూడా మరో రెండు జాబ్ నోటిఫికేషన్లను (TSPSC Job Notifications) విడుదల చేసింది. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులతో పాటు, ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్లను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ఈ నోటిఫికేషన్ల ద్వారా అగ్రికల్చర్ అండ్ కో ఆపరేటివ్ విభాగంలో 148 ఏఓ పోస్టులను, 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ.

ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 6 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 30 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

RTC లో 813 కండక్టర్ పోస్టులు భర్తీ .. మంత్రి పొన్నం ప్రభాకర్