నేటి నుంచే 9,168 'గ్రూప్‌-4' ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు! చివరితేది ఎప్పుడంటే?

డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. 



సరైన అర్హతలున్నవారు జనవరి 19 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చేఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. వాస్తవానికి డిసెంబరు 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల వారంపాటు వాయిదావేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సరైన అర్హతలున్నవారు జనవరి 19 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 

గ్రూప్-4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. 

వీటిలో కేటగిరీ-1లో జూనియర్ అకౌంటెంట్-429 పోస్టులు, 

కేటగిరీ-2లో జూనియర్ అసిస్టెంట్: 6,859 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు:

వ్యవసాయశాఖ-44బీసీ సంక్షేమశాఖ-307పౌరసరఫరాల శాఖ-72అటవీశాఖ-23
వైద్యారోగ్యశాఖ-338ఉన్నత విద్యాశాఖ-742హోంశాఖ-133నీటిపారుదల శాఖ-51
మైనార్టీ సంక్షేమశాఖ-191పురపాలక శాఖ-601పంచాయతీరాజ్-1,245రెవెన్యూశాఖ-2,077
సెకండరీ విద్యాశాఖ-97రవాణాశాఖ-20గిరిజన సంక్షేమ శాఖ-221మహిళా, శిశు సంక్షేమం-18
ఆర్థికశాఖ-46కార్మికశాఖ-128ఎస్సీ అభివృద్ధి శాఖ-474యువజన సర్వీసులు-13

కేటగిరీ-3లో జూనియర్ ఆడిటర్-18 పోస్టులు, 

వార్డు ఆఫీసర్-1,862 పోస్టులు ఉన్నాయి. 



విభాగాల వారీగా అత్యధికంగా 

పురపాలకశాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

రెవెన్యూశాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా.. 

వీటిలో సీసీఎల్ఏ పరిధిలో 1,294 ఉన్నాయి. సాధారణ, 

సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులున్నాయి. 


Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

RTC లో 813 కండక్టర్ పోస్టులు భర్తీ .. మంత్రి పొన్నం ప్రభాకర్