పదో తరగతి పాసైన వారికి తెలంగాణలో రేషన్‌ డీలర్‌ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి  27 చౌకధరల దుకాణం డీలర్ పోస్టులు ఆదిలాబాద్‌ జిల్లా రెవెన్యూ డివిజన్‌ పరిధిలో..

27 చౌకధరల దుకాణం డీలర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత గ్రామ పంచాయితీలో నివాసి అయ్యి ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో జనవరి 6, 2023వ తేదీలోపు ఆదిలాబాద్‌ ఆర్‌డీవో కార్యాలయంలో అందజేయాలి




దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష జనవరి 22వ తేదీన నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ జనవరి 27న ఉంటుంది. రాత పరీక్ష 80 మార్కులకు , ఇంటర్వ్యూ 20 మార్కులకు కలిపి మొత్తం 100 మార్కులకు నియామక ప్రక్రియ ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్‌ చేసుకోవచ్చు.


నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

RTC లో 813 కండక్టర్ పోస్టులు భర్తీ .. మంత్రి పొన్నం ప్రభాకర్