కేంద్ర రాష్ట్రాల మద్య పరిపాలనా సంబందాలు తెలియ జేసే ఆర్టికల్స్ ఏవి?

 *భారత సమాఖ్య - కేంద్రరాష్ట్ర సంబంధాలు*


1..సమాఖ్య విధానం ముఖ్య లక్షణం?

(A)   అధికారలన్ని కేంద్రం చేతిలో ఉండటం

(B)   రాష్ట్రాలకే అన్ని అధికారాలు ఉండటం

(C)   రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణి

(D)   కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన పంపిణి

[Ans: d]

Explanation: రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వాధికారాలు కేంద్ర రాష్ట్రాల మద్య పంపిణి అయిన ఉన్న ప్రభుత్వ విధానమే సమాఖ్య విదానం


2. "సమాఖ్య" ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ఏర్పడతాయి.

(A)   3 పద్దతులు

(B)   4 రకాలుగా

(C)   2 రాకాలుగా

(D)   ఒకేవిదంగా

[Ans: c]

Explanation: "సమాఖ్య" రెండు రకాలుగా ఏర్పడుతుంది 1 రాష్ట్రాల కలయిక వల్ల ఏర్పడే సమాఖ్య, 2 విచ్చిత్తి ప్రక్రియవల్ల ఏర్పడే సమాఖ్య.


3. భారత సమాఖ్య ఏ విదంగా ఏర్పడింది?

(A)   ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్

(B)   ఫెడరేషన్ బై డిస్ ఇంటిగ్రేషన్

(C)   A మరియు B

(D)   ఏదికాదు

[Ans: c]

Explanation: 1947 వరకు వేరుగా ఉన్న 563 సంస్థానాలు భారత్ కలవడం Fedaration by Integration, పెద్ద రాష్ట్రాలను పాలనా పరంగా చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం 1956 SRC ద్వారా రాష్ట్రాల ఏర్పాటు చేయడం అనగా Fedaration by disintegration.


4..భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం

(A)   సమాఖ్య

(B)   అర్ధసమాఖ్య

(C)   ఏకకేంద్ర లక్షణాలున్న సమాఖ్య

(D)   రాష్ట్రాల సమ్మేళణం

[Ans: d]

Explanation: భారతదేశ రాజ్యాంగాన్ని అనులరించి 1 వ ప్రకరణలో భారతదేశాన్ని Union of states రాష్ట్రాల సమ్మేళనంగా పేర్కోన్నారు.


5.మొట్ట మొదటి సారిగా భారతదేశంలో సమాఖ్య ఎప్పుడు ప్రవేశ పెట్టారు?

(A)   1950

(B)   1947

(C)   1935

(D)   1946

[Ans: c]

Explanation: 1935 భారత ప్రభుత్వ ఛట్టం ద్వారా "సమాఖ్య" ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేశారు.


6.సమాఖ్య ప్రభుత్వ లక్షణం కానిది?

(A)   లిఖిత రాజ్యాంగం

(B)   రాజ్యంగ ఆదిక్యత

(C)   దృడ రాజ్యాంగం

(D)   అఖిల భారత సర్వీసులు

[Ans: d]

Explanation: అఖిల భారత సర్వీసుకు చెందిన అధికారులు UPSC ద్వార ఎంపికై రాష్ట్రపతి చేత నియమించబడి. రాష్ట్రప్రభుత్వ పరిపాలనలో కీలక పదవుల్లో నియమితులై కేంద్ర ప్రభుత్వానికి భాద్యులై ఉంటారు. ఇది సమాఖ్య విదానానికి విరుద్దం.


7.దృడ రాజ్యాంగం అనగానేమి?

(A)   కఠినమైనది

(B)   సులబంగా సవరించగలది

(C)   2/3 మెజారిటీతో సవరించగలది

(D)   1/3 మెజారిటీతో సవరించగలది

[Ans: c]

Explanation: రాజ్యాంగంను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అతి సులువుగా సవరించడానికి వీలుపడదు, ఎలా అంటె రాజ్యాంగం ఔన్నత్వం కోల్పోతుంది. రాజ్యంగాన్ని సవరించడానికి ప్రత్యేక మెజారిటి 2/3 మెజారిటి అవసరము. అలాంటి రాజ్యాంగాన్ని దృడరాజ్యాంగం అంటారు.


8.ఏక కేంద్ర లక్షణం కానిది ఏది?

(A)   నూతన రాష్ట్రాల ఏర్పాటు

(B)   ఒకే రాజ్యాంగం

(C)   దృడ రాజ్యాంగం

(D)   గవర్నర్ ల నియమకం

[Ans: c]

Explanation: సమాఖ్య వ్యవస్థలో దృడ రాజ్యాంగం ఉంటుంది. కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమున్నట్లుగా సవరించడానికి వీలుపడదు, కావున కేంద్రం రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. కావున దృడ రాజ్యాంగం సమాఖ్య రాజ్య లక్షణం.

9..పార్లమెంటు ఇటీవల "తెలంగాణా" రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ లక్షణం గూర్చి తెలియజేస్తూంది?

(A)   సమాఖ్య విదానం

(B)   ఏక కేంద్ర విధానం

(C)   పునర్ వ్యవస్ఠీకరణ

(D)   ఉద్యమ ప్రభుత్వ లక్షణం

[Ans: b]

Explanation: భారత పార్లమెంట్ ఆర్టికల్ 3 ప్రకారం నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయగలదు. రాష్ట్రాల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోదు. ఇది ఏకకేంద్ర లక్షణం.


10..రాష్ట్ర జాభితాపై శాసనాలు చేసే అధికారం కేంద్రానికి ఎప్పుడు కలదు?

(A)   352 ఆర్టికల్ అమలులో ఉన్నప్పుడు

(B)   356 ఆర్టికల్ రాష్ట్రంలో ఉన్నప్పుడు

(C)   2/3 మెజారిటితో రాజ్యసభ సభ్యులు ఆమోదంతో తీర్మాణం చేస్తె

(D)   A,B,C లు అన్ని

[Ans: d]


11.కేంద్ర రాష్ట్రాల మద్య పరిపాలనా సంబందాలు తెలియ జేసే ఆర్టికల్స్ ఏవి?

(A)   245 - 255

(B)   256 - 263

(C)   264 - 300

(D)   300 - 310

[Ans: b]


𝚃𝙾 𝙹𝙾𝙸𝙽 𝚃𝙴𝙻𝙰𝙽𝙶𝙰𝙽𝙰 𝙶 𝙺 𝙶𝚁𝙾𝚄𝙿𝚂

https://wa.me/919912541440


టలిగ్రామ్ గ్రూప్

http://t.me/telanganaGKgroups


🔥జబ్ నోటిఫికేషన్🔥

https://telanganagkgroups.blogspot.com/

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

RTC లో 813 కండక్టర్ పోస్టులు భర్తీ .. మంత్రి పొన్నం ప్రభాకర్