జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి త్వరలో కొత్త నోటిఫికేషన్! ఈసారి ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారంటే?

ఈ ఏడాది మే నెలలో 1000 జేఎల్‌ఎం పోస్టుల నియామకానికి జులైలో రాతపరీక్షను సైతం నిర్వహించిన తర్వాత పేపర్ లీకేజీ కారణంగా నోటిఫికేషన్‌ను ఆగస్టులో రద్దుచేశారు. కొత్త నోటిఫికేషన్‌లో 1300 పోస్టులు ఉండే అవకాశం.

    


తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో జూనియర్ లైన్‌మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో 1000 జేఎల్‌ఎం పోస్టుల నియామకానికి జులైలో రాతపరీక్షను సైతం నిర్వహించిన తర్వాత పేపర్ లీకేజీ కారణంగా నోటిఫికేషన్‌ను ఆగస్టులో రద్దుచేశారు. అప్పటి నుంచి ఉద్యోగార్థులు కొత్త నోటిఫికేషన్‌కు ఎదురుచూస్తున్నారు. 

అయితే జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి సంబంధించిన త్వరలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈసారి 1000 పోస్టులు కాకుండా.. కొత్త నోటిఫికేషన్‌లో మొత్తం 1300 పోస్టులు ఉండొచ్చని అధికారులు అంటున్నారు. డిస్కం పరిధిలో ఏడాదికాలంలో కొత్త విద్యుత్తు ఉపకేంద్రాలు పెరగడం.. కొత్తగా పలు సెక్షన్లు ఏర్పాటు కాబోతుండటంతో ఆ మేరకు పోస్టుల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ఐటీఐ ఎలక్ట్రికల్, వైర్‌మెన్, ఇంటర్ ఒకేషనల్‌లో ఎలక్ట్రికల్ పూర్తిచేసిన 18-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. ఇదివరకు పురుషులను మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు మహిళలు కూడా ఈ పోస్టులకు పోటీ పడుతున్నారు.


ప్రైవేటు వ్యక్తులతో పనులు...


సంస్థల్లో ఉద్యోగుల కొరత ఉండటంతో కొంతకాలం నుంచి ఆర్టిజన్లు, గుత్తేదారుల కింద అడ్డాకూలీలతో పనులు చేయిస్తున్నారు. విద్యుత్తు ఉపకేంద్రాలు శివార్లలో రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల పరిధిలో 237 ఉంటే ఇప్పుడు 348కి పెరిగాయి. మొత్తంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 33/11కేవీ 480 విద్యుత్తు ఉపకేంద్రాలున్నాయి. నెట్‌వర్క్ పెరిగిన స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్‌మెన్ల సంఖ్య పెరగలేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఒక లైన్‌మెన్ పరిధిలో అనధికారికంగా ఎలక్ట్రికల్ పని తెలిసిన వారిని రోజుకూలీల కింద స్తంభాలు ఎక్కించడం వంటి పనులు చేయిస్తున్నారు. సరైన శిక్షణ లేని వీరు పనులు చేయబోయి కొన్ని సందర్భాల్లో వీరు కరెంట్ షాక్‌తో మృత్యువాత పడుతున్నారు. అలా ఈ ఏడాది రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో పదిమంది వరకు మృత్యువాత పడ్డారు. లైన్‌మెన్లు ఉన్నచోట కూడా వయసు రీత్యా స్తంభాలు ఎక్కలేక ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయిస్తున్నారు. నియామక ప్రక్రియ త్వరగా పూర్తయితే ఈ కష్టాలు తీరినట్లే

Comments

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

RTC లో 813 కండక్టర్ పోస్టులు భర్తీ .. మంత్రి పొన్నం ప్రభాకర్