తెలంగాణలో ఇనుప ఖనిజాల నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం?

 

ప్రాక్టీస్‌ బిట్స్‌



1. ఖనిజ వనరుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు?

1) మెటీరియాలజీ 2) మినరాలజీ
3) పెడాలజీ 4) ఓరాలజీ

2. 2017-18 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఖనిజ రంగం వాటా ప్రస్తుత ధరలలో ఎంత?

1) 4.3 శాతం 2) 2.3 శాతం
3) 3.4 శాతం 4) 5.3 శాతం

3. కింది వాటిలో ఇంధన ఖనిజం కానిది?

1) పెట్రోలియం 2) బొగ్గు
3) సహజ వాయువు 4) థోరియం

4. తెలంగాణలో ఇనుప ఖనిజాల నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం?

1) బయ్యారం
2) ఏటూరునాగారం
3) అచ్చంపేట 4) మణుగూరు

5. తెలంగాణలో అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేసే జిల్లా?

1) జయశంకర్‌ భూపాలపల్లి
2) మంచిర్యాల
3) కరీంనగర్‌
4) భద్రాద్రి కొత్తగూడెం

6. భారతదేశంలో మొదటగా యురేనియం నిల్వలు గుర్తించిన ప్రాంతం?

1) సింగ్భం 2) జాదుగూడ
3) లంబాపూర్‌ 4) ఏదీకాదు

7. తెలంగాణలో మాంగనీసు అధికంగా విస్తరించి ఉన్న జిల్లా?

1) హనుమకొండ 2) కరీంనగర్‌
3) ఆదిలాబాద్‌
4) నాగర్‌కర్నూలు

8. రాష్ట్రంలో సున్నపురాయిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా?

1) రంగారెడ్డి
2) సూర్యాపేట
3) ఖమ్మం
4) మహబూబాబాద్‌

9. కింది వాటిలో లోహ ఖనిజం కానిది?

1) రాగి 2) వెండి
3) బంగారం 4) ముగ్గురాయి

10. భారతదేశంలో అధికంగా ఇనుమును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?

1) తెలంగాణ 2) కర్ణాటక
3) మధ్యప్రదేశ్‌ 4) రాజస్థాన్‌

11. కింది వాటిలో ఈ మధ్య కాలంలో తెలంగాణలో యురేనియం అన్వేషణ, తవ్వకాలకు సంబంధించి వార్తల్లో ఉన్న ప్రాంతం?

1) బెజ్జార్‌ 2) సోమనపల్లి
3) అమ్రాబాద్‌ 4) జిన్నారం

12. కింది ఏ అవిభాజిత జిల్లాలు తెలంగాణలో ఎక్కువ గనుల ఆధారిత ఆదాయాన్ని ఇస్తున్నాయి?

1) కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌
2) మహబూబ్‌నగర్‌, నల్లగొండ
3) రంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ
4) నిజామాబాద్‌, మెదక్‌

13. బ్రౌన్‌ (గోధుమ రంగు) గ్రానైట్‌ వెలికితీతతో కింది వాటిలో ఏ అవిభాజిత జిల్లా అధిక ఆదాయ వనరు?

1) రంగారెడ్డి 2) ఖమ్మం
3) కరీంనగర్‌ 4) ఆదిలాబాద్‌

14. కింది వాటిలో అలోహ ఖనిజం ఏది?

1) మాంగనీసు 2) ఇనుము
3) బంగారం 4) గ్రాఫైట్‌

4




మైకా

  • ప్రపంచంలో మైకాను అత్యధికంగా భారతదేశం ఉత్పత్తి చేస్తుంది.
  • దేశంలో జార్ఖండ్‌ మైకాను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. కల్లూరు, వావిలాల, కన్నూరు ప్రాంతాల్లో ఇది విస్తరించి ఉంది.

గ్రాఫైట్‌

  • భారతదేశంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రాఫైట్‌ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి.
  • భారతదేశంలో ప్రస్తుతం తమిళనాడులో గ్రాఫైట్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని పెన్సిళ్లు, రంగులు, పూసల తయారీలో ఉపయోగిస్తారు. గ్రాఫెట్‌ను నల్లసీసం (Black Lead) అని కూడా పిలుస్తారు.
  • ఉమ్మడి ఖమ్మంలోని ఇప్పలపాడు, చిగురుమామిడి, సిద్ధారాం, బోలపల్లె ప్రాంతాల్లో ఇది విస్తరించి ఉంది.

వజ్రాలు

  • భారతదేశంలో వజ్రాలు మధ్యప్రదేశ్‌లోని పన్నా ప్రాంతంలో అధికంగా లభిస్తున్నాయి. తెలంగాణలో మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాలోని కోయిలకొండ, దేవరకద్ర ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు బయటపడ్డాయి. కొల్లాపూర్‌, అచ్చంపేటలోని బొల్లారం, సోమశిల, వనపర్తిలోని మధ్యమడుగు, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, యాదాద్రి భువనగిరి ప్రాంతాలు వజ్రాలకు ప్రసిద్ధి చెందాయి.

స్టియోటైట్‌

  • దీనిని ప్రధానంగా పౌడర్‌ తయారీలో, పింగాణి తయారీలోనూ ఉపయోగిస్తారు. ఈ ఖనిజం సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌ ప్రాంతాల్లో లభ్యమవుతుంది.

ఇసుకరాయి (సాండ్‌స్టోన్‌)

  • ఇది వికారాబాద్‌ జిల్లాలోని తాండూర్‌లో లభ్యమవుతుంది. ఇసుక మైనింగ్‌ విధానం, 2014 ప్రకారం, కొన్ని ప్రవాహాల నుంచి ఇసుక వెలికితీత, సరఫరా కోసం TSMDCకి అప్పగించారు. TSMDC 70 ఇసుక బేరింగ్‌ ప్రాంతాల్లో (నవంబర్‌ 2021 నాటికి) పని చేయడానికి పర్యావరణ అనుమతులను కలిగి ఉంది. మరో 100 ఇసుక బేరింగ్‌ ప్రాంతాలు 2021-22 చివరి నాటికి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. గృహ నిర్మాణం, నీటి పారుదల రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు కార్పొరేషన్‌ ఇసుకను సరఫరా చేస్తుంది.
  • 2020-21 సంవత్సరంలో ఇసుక తవ్వకాల వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.783.75 కోట్లు చేరుతుంది. దీంతో నేరుగా 5,250 మందికి ఉపాధి కల్పించింది. 2021-22 నవంబర్‌ వరకు రాష్ట్ర ఖజానాకు రూ.546 కోట్లు రాగా ఆ ఆదాయంలో దాదాపు మూడింట ఒక వంతు జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌కు వెళ్తుంది. ఈ మొత్తాన్ని స్థానిక జనాభా అవసరాల కోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, ఆరోగ్య సౌకర్యాలు, మరుగుదొడ్ల నాణ్యతను మెరుగుపరచడానికి నిధులను అందిస్తుంది.

పాలరాయి

  • ఖమ్మం జిల్లాలోని ముదిగొండ, వరంగల్‌ రూరల్‌ పాల్వాయ్‌ ప్రాంతాల్లో లభ్యమవుతాయి.

ఇంధన ఖనిజాలు: బొగ్గు (Coal)

  • దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ర్టాల్లో అత్యధికంగా బొగ్గు నిక్షేపాలు తెలంగాణలో ఉన్నాయి. ఇది 11,394.76 మిలియన్‌ టన్నుల నిరూపితమైన డిపాజిట్లను కలిగి ఉంది. దేశంలో నిరూపితమైన మొత్తం డిపాజిట్లలో 7.04 శాతం వాటాను కలిగి ఉంది. మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 75 శాతం నిల్వలు ఉన్నాయి.
  • సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (sccl), ఒక రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణలో ప్రాథమిక బొగ్గు మైనింగ్‌ కార్పొరేషన్‌. ఇది భారతదేశంలో రెండో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు. సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ మొత్తం బొగ్గు ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 42.5 శాతం పెరిగింది. 2020-21లో 32.65 మిలియన్‌ టన్నుల నుంచి డిసెంబర్‌ 2021-22 వరకు 46.52 మిలియన్‌ టన్నులకు పెరిగింది.

1

  • అత్యంత శ్రేష్టమైన బొగ్గు ఆంథ్రసైట్‌ కాగా అతి తక్కువ శ్రేష్టమైన బొగ్గు పీట్‌. భారతదేశంలో బిట్యుమినస్‌ బొగ్గు అధికంగా లభ్యమవుతుండగా తెలంగాణలో సెమీ బిట్యుమినస్‌ బొగ్గు (81-82 శాతం కార్బన్‌) లభిస్తుంది. దేశంలో అతిపెద్ద బొగ్గు గని ఝరియా (జార్ఖండ్‌) కాగా రాణిగంజ్‌ అతి పురాతనమైన బొగ్గుగనిగా ప్రసిద్ధి గాంచింది. తెలంగాణలో ప్రాణహిత, గోదావరి లోయ ప్రాంతంలో అధిక బొగ్గు నిల్వలు ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి అవుతుంది. దేశంలో ఉన్న మొత్తం బొగ్గు నిల్వలలో 20 శాతం వరకు తెలంగాణలోనే ఉన్నాయి.
    తెలంగాణలో బొగ్గు లభించే జిల్లాలు: మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, ములుగు.

ఉత్పత్తి కేంద్రాలు

  • పాల్వంచ, ఇల్లెందు, కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
  • మనుగూరు, పెనగడప, సత్తుపల్లి (ఖమ్మం జిల్లా)
  • తాండూరు, మేడిపల్లి, కాగజ్‌నగర్‌, ద్రోలి-బెల్లంపల్లి, చెన్నూర్‌ (మంచిర్యాల జిల్లా)
  • థిర్యాని (కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా)
  • రామగుండం, మంథని, ఖానాపూర్‌ (పెద్దపల్లి జిల్లా)
  • సనగూడెం, ఇంద్రారాం (జయశంకర్‌ భూపాలపల్లి)

అణు ఖనిజాలు

యురేనియం

  • యురేనియం ముడి ఖనిజం పిచ్‌బ్లెండ్‌. దేశంలో యురేనియం నిల్వలు ఆశించినంత స్థాయిలో లేవు. దీంతో రష్యా, కజకిస్తాన్‌, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ప్రపంచ యురేనియం ఉత్పత్తిలో భారతదేశ యురేనియం ఉత్పత్తి కేవలం 2 శాతంగానే ఉంది. ఇదిలా ఉండగా దేశంలో మొట్టమొదట యురేనియం నిల్వలను జాదుగూడ (జార్ఖండ్‌)లో 1951లో గుర్తించారు. 1967 నుంచి వెలికి తీశారు. జాదుగూడ (సింగ్భం జిల్లా) లో ఉన్న యూసీఐఎల్‌ ప్రధాన కార్యాలయాన్ని 1967లో స్థాపించారు.
    తెలంగాణలో యురేనియం విస్తరించి ఉన్న ప్రాంతాలు: లంబాపూర్‌, బిట్రియాల్‌, కుప్పునూర్‌, పెద్దగట్టు, వనపర్తి, పెద్దూర్‌, కొత్తూరు, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌.
  • కోరండం, గార్నెట్‌, గెలీనా, జిర్కోనియం, కయోనైట్‌లు ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్నాయి.

కొన్ని ఇతర ఖనిజాలు 

డోలమైట్‌

  • దీనిని ఎక్కువగా ఫెర్రో అల్లాయ్స్‌, ఇనుము, కాస్మోటెక్స్‌ తయారీలో ఉపయోగిస్తారు. ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.

క్వార్ట్‌
ఇది విస్తరించిన జిల్లాలు: నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి.

ఫెల్డ్‌స్ఫార్‌
విస్తరించిన జిల్లాలు: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి.

లాటరైట్‌
విస్తరించిన జిల్లాలు: ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, కామారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, వికారాబాద్‌, రంగారెడ్డి, ములుగు.

రోడ్‌ మెటల్‌
విస్తరించిన జిల్లాలు: నిర్మల్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, కామారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నల్లగొండ, యాదాద్రి భూవనగిరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, ములుగు.

స్టోన్‌ మెటల్‌
విస్తరించి ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, సిద్దిపేట, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, వికారాబాద్‌.

  • బంకమట్టి మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో విస్తరించి ఉంది.

    మైనింగ్‌

    • మైనింగ్‌ అనువైన ఖనిజాలు తెలంగాణలో ఉన్నాయి. కాగా మైనింగ్‌, క్వారియింగ్‌ కార్యకలాపాల కోసం 88809 హెక్టార్ల భూమిని లీజుకు తీసుకున్నారు. రాష్ట్రంలో 1904 మినరల్‌ పరిశ్రమలుండగా జోగులాంబ గద్వాల (723), ఖమ్మం (463), వికారాబాద్‌ (234), కుమ్రంభీం ఆసిఫాబాద్‌ (183) జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి. 2019-20లో రాష్ట్రం మొత్తం ఆదాయంలో మినరల్‌ ఉత్పత్తి ద్వారా రూ. 3,715.78 కోట్ల ఆదాయం వచ్చింది.
    • 2014-15 నుంచి 2019-20 మధ్య అత్యధిక రాష్ట్ర జనరల్‌ మినరల్‌ రాబడి రూ.4848.85 కోట్లు వచ్చింది. 2021 నవంబర్‌ నాటికి ఇసుకను వెలికితీసే 70 ఇసుక బేరింగ్‌ ప్రాంతాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉంది. మరో 100 ఇసుక బేరింగ్‌ ప్రాంతాలు 2021-22 చివరి నాటికి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు కార్పొరేషన్‌ ఇసుకను గృహ నిర్మాణం, నీటి పారుదల రంగాలకు సరఫరా చేస్తుంది.
    • 2020-21లో ఇసుక తవ్వకాల వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.783.75 కోట్లు వచ్చాయి. ఇది నేరుగా 5250 మందికి ఉపాధి కల్పించింది. 2021-22 నవంబర్‌ వరకు రాష్ట్ర ఖజానాకు వచ్చే రూ.546 కోట్ల ఆదాయంలో దాదాపు మూడింతలు మినరల్‌ ఫౌండేషన్‌కు వెళ్తుంది. ఇది ప్రత్యేకంగా స్థానిక జనాభాకు ప్రయోజనం చేకూర్చడానికి ఉపయోగిస్తున్నారు. ఈ నిధుల ద్వారా స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాలను, పాఠశాలలు, ఆరోగ్య సౌకర్యాలు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పిస్తుంది.
    • అక్రమ ఇసుక తవ్వకాలను పర్యవేక్షించడానికి, అరికట్టడానికి, ఇసుక ధరలను కొనుగోలు చేసి తెలియజేయడానికి, ఇసుక అక్రమ రవాణాను నిరోధించడానికి TSMDC ఇంటిగ్రేటెడ్‌ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసింది.

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

RTC లో 813 కండక్టర్ పోస్టులు భర్తీ .. మంత్రి పొన్నం ప్రభాకర్