Bank of Baroda Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 546 పోస్టులు.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

 భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. 546 వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..


భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఒప్పంద ప్రాతిపదికన 546 వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారుల వయసు అక్విజిషన్‌ విభాగానికి సంబంధించిన పోస్టులకైతే 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి వయసు 24 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 14, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.600లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులు: 24
  • ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ పోస్టులు: 17
  • అక్విజిషన్‌ పోస్టులు: 505

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి


 కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..