భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్

 భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 30 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ట్రెయినీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..



ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కెమికల్/కంప్యూటర్‌ సైన్స్‌/హెచ్‌ఆర్‌ తదితర విభాగాల్లోని ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 28, 32 ఏళ్లకు మించకుండా ఉండాలి

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మార్చి 7, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.472లు, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులకు రూ.177లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.30,000ల నుంచి రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.


చివరి తేదీ :  మార్చి 7, 2023వ
అర్హత : 
బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా
జీతం : 
రూ.30,000ల నుంచి రూ.55,000ల వరకు

పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..