Jobs In Airindia: ఎయిర్ ఇండియా ఉద్యోగాలు..దరఖాస్తుల ఆహ్వానం..
దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. గతేడాది దీనిని టాటా గ్రూప్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఎయిర్ ఇండియా రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఎయిర్‌లైన్‌లో ప్రస్తుతం 140 విమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో అత్యాధునిక విమానాలను నడిపించే పైలట్లకు ఏకంగా ఏడాదికి రూ.2 కోట్ల వరకు ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు బిజినెస్ టుడే పేర్కొంది. బోయింగ్ బీ777 క్యాప్టెన్ కోసం రూ.2 కోట్లు వెచ్చించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది..
ఎయిర్‌లైన్ యొక్క ప్రకటన ఇలా ఉంది.. 'B737 NG/MAX రేటెడ్ పైలట్ల నుండి B777 ఫ్లీట్ కోసం ఫస్ట్ ఆఫీసర్లకు దరఖాస్తులు ఆహ్వానింస్తున్నామని.. ఈ పైలట్లకు నెలకు $21,000 చెల్లించబడుతుందని అన్నారు. అంటే ఇది భారతీయ కరెన్సీలో మొత్తం రూ.17,39,118 వరకు ఉంది. సంవత్సరానికి లెక్కిస్తే, మొత్తం 2,08,69,416 ఉంటుంది. B737 NG/MAX విమానాన్ని నడిపే సామర్థ్యం ఉన్న పైలట్ల సంఖ్య తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ కొరత వల్లనే ఆ ఉద్యోగానికి ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తున్నారు. దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
పైలట్లతో పాటు.. ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ మరియు ఇతర సాంకేతిక ఉద్యోగాలను నియమిస్తోంది. ఆ ఉద్యోగాలన్నీ ఎయిర్ ఇండియా వెబ్సైట్లో ప్రకటించబడ్డాయి. 470 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసేందుకు ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకోవడంతో భారత విమానయాన రంగంలో 2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు లభిస్తాయని బిజినెస్ టుడే గతంలో నివేదించింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా వెబ్ సైట్లో కొత్త నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుండడం ఆ ట్రెండ్‌కి నాందిగా తెలుస్తోంది.
దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
Maloth gopal
ReplyDeleteMohammad Sarwar
ReplyDeleteMohammad Sarwar
ReplyDeletesarvarmd0692@gmail.com
ReplyDelete