Scholarship: రూ.కోటి విలువైన స్కాలర్‌షిప్స్‌ అందిస్తున్న ప్రొపెల్డ్‌ కంపెనీ.. ఇలా అప్లై చేయండి

 దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లు కోట్లలో ఉంటే, పీజీ చేస్తున్న వాళ్లు మాత్రం లక్షల్లోనే ఉంటున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.


 ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక సమస్యలే ప్రధానంగా అడ్డొస్తున్నాయని సర్వేలు పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు ఉచిత విద్యను అందించడంతో పాటు, ఉపకార వేతనాలు ఇస్తున్నా పూర్తిస్థాయిలో అందట్లేదు. ఈ క్రమంలో కొన్ని ప్రైవేటు సంస్థలు అందిస్తున్న ఉపకారవేతనాలు ప్రతిభావంతులకు అండగా నిలుస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ ప్రొపెల్డ్‌(Propelled) అనే సంస్థ పీజీ విద్యార్థుల కోసం రూ.కోటి రూపాయల స్కాలర్‌షిప్‌ను(1 crore scholorship) ప్రకటించింది. ఈ మొత్తాన్ని 500 మంది పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందజేయన్నారు. అర్హత, అప్లికేషన్‌ ప్రాసెస్‌ తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.

విద్యార్థుల కలకు అండగా నిలుస్తాం

ఉన్నత విద్య చదవాలని అనుకునేవారికి, ఆర్థిక సమస్యలు అడ్డుకాకూడదనే ఆశయంతో ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తున్నట్లు ప్రొపెల్డ్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిబు ప్రసాద్ దాస్ వెల్లడించారు. రేపటి భవిష్యత్తు కోసం కలలు కనేవారి కోసం తమ సంస్థ అండగా నిలుస్తుందన్నారు. ప్రతిభావంతులను గుర్తించి, వారి అకడమిక్ ప్రోగ్రెస్, పీజీలో వారు తీసుకునే కోర్సు , ఇతర అంశాలను పరిశీలించి 500 మందిని ఎంపిక చేసి ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తామన్నారు.

రామప్ప గురించిన అద్భుత విషయాలు 👆👆





 దరఖాస్తు ప్రక్రియ

ఇండియాలోని ఏదైనా యూనివర్సిటీలో 2023-24 సంవత్సరానికి పీజీ చేసేందుకు ఎన్‌రోల్‌ చేసుకున్న అభ్యర్థులు దీనికి అర్హులు. 

మార్చి 5 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసుకోడానికి సంస్థ వెబ్సైట్ Scholarship.propelld.com లోకి వెళ్లాలి. 

అందులో వారు సూచించిన మేరకు మీ వ్యక్తిగత, ఎడ్యుకేషన్ వివరాలు ఇవ్వాలి. 

వాటికి సంబంధించిన డాక్యుమెంట్ సాఫ్ట్‌కాపీలను అప్‌లోడ్ చేయాలి. 

ప్రోసెస్ పూర్తయిన తర్వాత వచ్చిన ఫారం డౌన్‌లోడ్‌ చేసి, భద్రపరుచుకోవాలి.

స్కాలర్‌షిప్‌ ఎంత

సెలక్ట్ చేసిన వారికి.. మొత్తం ఫీజులో 60% వరకు స్కాలర్‌షిప్ ఇస్తారు. పిక్స్డ్ సమ్ కింద రూ.2,00,000 వరకు, అదనపు ఖర్చులు కింద రూ.1,00,000 దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు క్రెడిట్ లైన్ల ద్వారా ఫీజు ఫైనాన్స్ చేయడానికి రూ.10 లక్షల వరకు అప్లై చేసుకోవచ్చు.

సంస్థ వివరాలు

రూ.కోటి విలువైన స్కాలర్‌షిప్‌లు అందిస్తున్న ప్రొపెల్డ్‌ సంస్థ బెంగుళూరుకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్. దీనిని IIT, IIM వంటి ప్రఖ్యాత సంస్థల్లో చదివిన పూర్వ విద్యార్తులు స్థాపించారు. వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్, స్టెల్లారిస్ వెంచర్స్, ఇండియా కోటియంట్ సహకారంతో చదువుకు సంబంధించిన రుణాలను అందిస్తూ ఉంటుంది. edTech, K12, విశ్వవిద్యాలయాలు, వెయ్యికి పైగా ఉన్నత విద్యాసంస్థలు, పాఠశాలలతో వీరు అనుసంధానమై ఉన్నారు. రూ.1200 కోట్ల వార్షిక టర్నోవర్, 1% కంటే తక్కువ NPAలతో నడుస్తున్న లోన్ పోర్ట్ఫోలియో.


కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        


Comments

  1. Please share the information my phone7075983964

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..