మనలో లోపమెక్కడుంది .. ?

వాళ్లకు కనబడ్డ అవకాశాలు మనకెందుకు కనబడుతలెవ్వో ఆలోచించండి. 



 అసలు లోపమెక్కడుంది ....??


వాళ్ళు ...

సమోసా అన్నరు..

కచోరీ అన్నరు..

పానిపురి అన్నరు..

జిలేబి అన్నరు..

బేల్ పూరి అన్నరు..


మనం ...

వ్యవసాయం లేదు అన్నం.

పనులు లేవ్వు అన్నం..

ఇక్కడ ఇక బ్రతుకే లేదు అన్నం..


వాళ్ళు...

షాప్ లు పెట్టిండ్రు..

సెట్టర్ లు తీసిండ్రు..

బజార్లు అక్రమించిండ్లు.

డ్రై ఫ్రూట్స్ అమ్మిండ్రు.

ఊర్లు కబ్జా చేసిండ్రు.


మనం ..

బ్రతకాలంటే ఎడారి దేశం దిక్కు చూసినం..

ఇల్లు కుదబెట్టి గాలి మోటరు ఎక్కినం.

కానరాని చోట కష్ట పడడానికి కన్న వాళ్ళను కూడా కాదనుకొన్నాం.

ఏజెంట్ల మోసానికి ఎక్కి ఎక్కి ఏడ్చినం.


 కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        

       


వాళ్ళు...

ఒక్కో మెట్టు ఎక్కుతూ పోయిండ్రు..

చిన్న షాప్ పెద్ద షాప్ అయ్యింది.

ఒక్క మడిగ నాలుగు మడిగలు అయినాయి.

ఊర్ల నుండి తమ్ముళ్లు, బామ్మర్దులు దిగిండ్రు.


మనం

చెప్పిన పని ఒకటి ఇచ్చిన పని ఒకటి.

మోసం చేసిన ఏజెంట్..

తట్టుకోలేని గుండే కొట్టుకోవడం ఆగింది.

శవం ఇంటికి రాడానికి కూడా డబ్బులేక చందాలు వేసుకొని పంపే స్టేజ్ మనది.


వాళ్ళు..

బంగాళా పెద్దగా అయ్యింది. 

ఖరీదు కార్లు ఇంటి ముందు వెలిసినయి.

సొసైటీలో లో పరిచయాలు పెరిగినయి.

జై సింగ్ అని గొంతులు అరిచినయి.


మనం...

డబ్బులు కట్టందే శవం కదల లేని స్టేజీ.

మళ్ళా చందాలు వేస్తేనే కట్టే కాలింది.

జై గల్ఫ్ పాలసీ అని అరిస్తే వినే నాదుడేది...


వాళ్ళు ...

వారాసులు సామ్రాజ్యాన్ని విస్తరించారు.

కొడుకులు, మనుమలు ఆస్తులు పెరుగుతూ పోయినాయ్

రాజకీయాల్లో డామినేషన్ వాళ్లదే అయ్యింది.


మనం ...

అవ్వ నేను కూడా దుబాయి పోతానే ...

వారాసుడు కూడా దుబాయ్ కి రెడీ అయ్యిండు.

అయ్యా చేసిన అప్పు తీరాలంటే తప్పదే అవ్వ ..


మళ్ళీ కథ మొదలయ్యిందా ...??


వాళ్లకు ఇక్కడ కనబడ్డ అవకాశాలు

మనకెందుకు కనబడుత లెవ్వు..


సేకరణ : మంజీరా శ్రీనివాస్ FB  పోస్ట్


దీనిపై మీ అభిప్రాయాన్ని కిందా కామెంట్ లో తెలపండి 

Comments

  1. Excellent explain

    ReplyDelete
  2. 1).First your a indian or England or Pakistan?
    2) Your Hindu or Cristian or Muslim?
    Straight forward my answer is Your a Cristian am right.don't create like this message. This is Hindu country.deffenetly every Indian Can demond......we want one nation one Religion ✊🚩

    ReplyDelete
    Replies
    1. పాకిస్తాన్ , ముస్లిం అన్నావంటే ఇది బత్తి గల్లా పనే

      Delete
  3. చాపకింద నీరు ల పాకిర్రు , అది మన చాటకానితనం వాళ్ళ

    ReplyDelete
  4. Enka mangchi matter rayalsindi

    ReplyDelete
  5. వాళ్ళు చేసే పని మనం కూడా చేస్తే బాగుపడతాం కానీ మనకు ఆ పని చేస్తే చీఫ్ గా ఉంట్టుందని అనుకుంటున్నాము. కానీ అందులోనే మన జీవితం ఎదుగుదల ఉందని మన మూర్ఖత్వంతో గమనించలేకపోతున్నాం..☹️

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..