తెలంగాణ జెన్‌కోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల...

 హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (TSGENCO) ..





ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల సంస్థ యాజమాన్యం ప్రకటన జారీచేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఇంజనీరింగ్‌, సివిల్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 29, 2023వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ జెన్‌కో సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలతోపాటు పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాలలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది.


ఖాళీల వివరాలు

మొత్తం అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు 339 వరకు ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే..

  • లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌లో ఖాళీలు: 94
  • జనరల్ రిక్రూట్‌మెంట్‌లో ఖాళీలు: 245

అర్హతలు ఏమేమి ఉండాలంటే...

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కంట్రోల్ ఇంజినీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ పవర్/పవర్ ఎలక్ట్రానిక్స్/సివిల్ ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఈ లేదా బీటెక్‌లో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 2023 జులై 1వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఎవరైనా అక్టోబర్‌ 29, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 7, 2023వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.65,600 నుంచి రూ.1,31,220 వరకు జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు…

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 7, 2023.
  • దరఖాస్తు ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: అక్టోబర్‌ 29, 2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్‌ 29, 2023.
  • రాత పరీక్ష తేదీ: డిసెంబర్‌ 3, 2023.


  • ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
    నోటిఫికేషన్ PDfCLICK HERE
    అధికారిక వెబ్‌సైట్CLICK HERE
    వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
    టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


Comments

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

RTC లో 813 కండక్టర్ పోస్టులు భర్తీ .. మంత్రి పొన్నం ప్రభాకర్