సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. విద్యార్హత డిగ్రీ

 సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. స్పెషలిస్ట్ కేటగిరీలో ఆఫీసర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 192 ఖాళీలను బర్తీ చేయనున్నారు. 


దేశ వ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో వేర్వేరు స్ట్రీమ్స్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. హ్యూమన్ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్ ఈ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 192 ఖాళీలకు గాను.. ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌ కేటగిరీ) స్కేల్‌ I: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(15), రిస్క్‌ మేనేజర్‌(2), సెక్యూరిటీ ఆఫీసర్‌(15), లైబ్రేరియన్‌(1) చొప్పున పోస్టుల్ని భర్తీ చేయనుండగా.. స్కేల్‌ -2లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(73), లా ఆఫీసర్‌(15), క్రెడిట్‌ ఆఫీసర్‌(50), ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌(4), సీఏ -ఫైనాన్స్‌/అకౌంట్స్‌/జీఎస్టీ/ Ind AS/బ్యాలెన్స్‌ షీట్‌/ట్యాక్సేషన్‌ (3); స్కేల్‌ IIIలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (6), ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌ (5), స్కేల్‌ IV రిస్క్‌మేనేజర్‌ (1); స్కేల్‌ Vలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (1), రిస్క్‌ మేనేజర్‌ (1) చొప్పు ఉన్నాయి.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో పని అనుభవం ఉండాలి. పలు పోస్టులకు సంబంధించి ఇంజినీరింగ్‌/డేటా అనలిటిక్స్‌లో డిగ్రీ/ఎంబీఏ/ ఎంబీఏ ఫైనాన్స్‌/ఎంసీఏ/ఎమ్మెస్సీ(ఐటీ) వంటి విద్యార్హత కలిగి ఉండాలి. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనిష్ట వయసు 30 ఏళ్లుకాగా, గరిష్టంగా 45 ఏళ్లుగా నిర్ణయించారు. స్కేల్‌ 1 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 36,000 నుంచి రూ. 63,840 వరకు చెల్లిస్తారు..

ఇక స్కేల్‌ II పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 48,170 నుంచి రూ. 69,810 వరకు చెల్లిస్తారు. ఇక స్కేల్ III ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 63,940 నుంచి రూ. 78,230 వరకు చెల్లిస్తారు. స్కేల్‌ IV పోస్టులకు ఎంపికైన రూ. 76,010 నుంచి రూ. 89,890గా నిర్ణయించారు. ఇక స్కేల్‌ V పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 89,89 నుంచి రూ. 1,00,350 వరకు చెల్లిస్తారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 175 చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులు రూ. 850 చెల్లించాలి. అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను డిసెంబర్‌ మూడు లేదా నాలుగో వారంలో నిర్వహించనున్నారు..


ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

RTC లో 813 కండక్టర్ పోస్టులు భర్తీ .. మంత్రి పొన్నం ప్రభాకర్