Posts

Showing posts from November, 2023

డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు ..

Image
న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో.. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్‌ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు.. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ఎగ్జిక్యూటివ్ పోస్టులు 995 ఉన్నాయి. వీటిలో జనరల్‌ కేటగిరీలో 377 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 129 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 222 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 134 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 133 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు డిసెంబర్‌ 15, 2023 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన

10వ తరగతి, ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు.

Image
 10వ తరగతి, ఐటీఐ అర్హతతో  వివిధ ట్రేడ్‌లలో మొత్తం 110 పోస్టులను భర్తీ చేస్తారు... స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)రూర్కెలా ప్లాంట్‌లో ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేటర్),ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ మరియు అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ) సహా పలు పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు SAIL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 16, 2023. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్ సహా వివిధ ట్రేడ్‌లలో మొత్తం 110 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు  ఈ పోస్టులపై ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులు ముందుగా అర్హత, వయోపరిమితి, దరఖాస్తు మరియు ఎంపిక ప్రక్రియ, జీతం మరియు ఇతర వివరాలను జాగ్రత్తగా చదవండి. పోస్టుల వివరాలు ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేటర్)-20 పోస్టులు ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్)-10 పోస్టులు అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ) - 80 పోస్టులు ఎలక్ట్రీషియన్-25

ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

Image
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI Bank) ఒప్పంద ప్రాతిపదికన 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ (JAM, Executive) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.                               ఈ నోటిఫికేషన్ ద్వారా 2,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 06 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.    వివరాలు.. ➥ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ ‘ఒ’: 800  పోస్టుల కేటాయింపు:   ఎస్సీ- 120, ఎస్టీ- 60, ఓబీసీ- 216, ఈడబ్ల్యూఎస్‌- 80, యూఆర్‌- 324. అర్హత:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ అర్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.  ➥ ఎగ్జిక్యూటివ్‌- సేల్స్ అండ్ ఆపరేషన్స్(ఈఎస్‌వో): 1300  పోస్టుల కేటాయింపు:   ఎస్సీ- 200, ఎస్టీ- 86, ఓబీసీ- 326, ఈడబ్ల్యూఎస్‌- 130, యూఆర్‌- 558. అర్హత:   గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి

డిగ్రీ అర్హతతో 8,773 SBI లో ఉద్యోగాలు..

Image
 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI ).. భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 8773 క్లర్క్‌ (Junior Associate) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 17 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు డిసెంబర్‌ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/ చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక.. అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్

సిఆర్‌పీఎఫ్ లో ఉద్యోగాలు..ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75,000 వేతనం

Image
  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో ఉద్యోగం పొందాలనుకునేవారికి గుడ్ న్యూస్. సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్ లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల భర్తీ కోసం CRPF వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించనుంది.  ఇంటర్వ్యూ తేదీ నాటికి 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ CRPF రిక్రూట్‌మెంట్‌కు హాజరు కావచ్చు. CRPF యొక్క ఈ పోస్టుల కోసం నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు అభ్యర్థులు MBBS డిగ్రీ మరియు అవసరమైన ఇంటర్న్‌షిప్ అనుభవం కలిగి ఉండాలి. ఈ పోస్టుల కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులందరూ డిసెంబర్ 4వ తేదీ ఉదయం 9 గంటల నుంచి కింది ప్రదేశాల్లో హాజరుకావాలి. కాంపోజిట్ హాస్పిటల్, CRPF, జగదల్పూర్ కాంపోజిట్ హాస్పిటల్, CRPF, గౌహతి గ్రూప్ సెంటర్, CRPF, శ్రీనగర్ కాంపోజిట్ హాస్పిటల్, CRPF, నాగ్‌పూర్ కాంపోజిట్ హాస్పిటల్, CRPF, భువనేశ్వర్ ఈ ఖాళీలు ఛత్తీస్‌గఢ్, అస్సాం, జమ్మూ & కాశ్మీర్, మహారాష్ట్ర మరియు ఒడిశా స్థానాలకు ఉన్నప్పటికీ, నియామకం పొందిన వ్యక్తి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సేవలందించే బాధ్యతను కలిగి ఉంటారు. నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. జీతం   ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల

⭐ ఒక్క క్లిక్ తో 22 పేపర్లు ⭐ AP& TS అన్ని పేపర్స్ ఉచితంగా PDF రూపంలో ⭐

Image
    💥     తెలుగు ప్రజల కోసం  22 తెలుగు పేపర్స్ ఒకే చోట   💥 తెలుగు & ఇంగ్షీషు  మెయిన్ పేపర్స్  TS & AP  జిల్లా పేపర్స్    సండే బుక్స్           మీ  gmail  తో లాగిన్ తప్పని సరిగా చేయండి                        పేపర్ పేరుపై క్లిక్ చేయండి                                                                                                     🗞️ ఇంగ్లీష్ పేపర్స్ 🗞️       THE HINDU   DECCAN CHRONICLE THE HANS INDIA             The Times Of India మా  వాట్సాప్ గ్రూప్‌లో చేరండి  మా  టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరండి  

తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

Image
  భారత సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 1899 పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్‌, పోస్ట్‌మ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  .   భారత సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ.. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో స్పోర్ట్స్ కోటా కింద 1899 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టల్ అసిస్టెంట్ (598 ఖాళీలు), సార్టింగ్ అసిస్టెంట్ (143 ఖాళీలు), పోస్ట్‌మ్యాన్ (585 ఖాళీలు), మెయిల్ గార్డ్ (3 ఖాళీలు), ఎంటీఎస్‌ (570 ఖాళీలు) ఉద్యోగాల భర్తీకి అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 1,899 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు :  అభ్యర్థులు పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో అర్హత సాధించి ఉండాలి. వయసు :  అభ్యర్థుల వయసు ఎంటీఎస్‌ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలిన పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :   న