ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI Bank) ఒప్పంద ప్రాతిపదికన 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ (JAM, Executive) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 


                            


ఈ నోటిఫికేషన్ ద్వారా 2,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 06 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.   
వివరాలు..
➥ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ ‘ఒ’: 800 
పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 120, ఎస్టీ- 60, ఓబీసీ- 216, ఈడబ్ల్యూఎస్‌- 80, యూఆర్‌- 324.


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ అర్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 

➥ ఎగ్జిక్యూటివ్‌- సేల్స్ అండ్ ఆపరేషన్స్(ఈఎస్‌వో): 1300 

పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 200, ఎస్టీ- 86, ఓబీసీ- 326, ఈడబ్ల్యూఎస్‌- 130, యూఆర్‌- 558.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. కేవలం డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించడం అర్హత ప్రమాణాలకు అర్హతగా పరిగణించబడదు.

వయోపరిమితి: 01.11.2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల ప్రభావితులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.

జీత భత్యాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులకు ఏడాదికి రూ.6.14 - రూ.6.50 లక్షలు. ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలకు నెలకు రూ.29,000- రూ.31,000.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.


ఇంటర్వ్యూ విధానం: మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఇందులో కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22.11.2023

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.12.2023.

➥ ఆన్‌లైన్ పరీక్షతేదీలు..

* జేఏఎం పోస్టులకు 31.12.2023.

* ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 30.12.2023.


  

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 


Comments

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..