TSRTCలో కొలువుల జాతర...మంత్రి కీలక ప్రకటన

 టీఎస్‌ఆర్టీసీ (TSRTC)లో కొలువుల జాతర షురూ కాబోతోంది. రీసెంట్ గా మహాలక్ష్మి స్కీం తీసుకొచ్చి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.



తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్‌మెంట్ లో ఉద్యోగ నియామకాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఆర్టీసీలో 3 వేల కొత్త ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని ఆయన చెప్పారు. దీంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పరచుకొని కొత్త నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మహాలక్ష్మి స్కీం కింద మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించిన తర్వాత ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలోనే పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని మంత్రి అన్నారు.

పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయబోతున్నామని, వాటిలో దాదాపు 3 వేల మంది సిబ్బందిని తీసుకుంటామని మంత్రి అన్నారు. ఈ నెల 31వ ఈ ఉద్యోగాలకు సంబంధించి శుభవార్త వస్తుందని ఆయన చెప్పారు.

ఇప్పటికే 1325 డీజిల్, 1050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. వీటితో పాటు ఇంకొన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోందని చెప్పారు.

ఈ ఉద్యోగ నియామకాల్లో డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌ ఎక్కువగా ఉండనుందట. కొత్త బస్సులు వస్తున్నాయని కాబట్టి ఎక్కువ మంది స్టాఫ్ అవసరం అవుతారని భావించి ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Comments

  1. Replies
    1. Applications appudu start ithayi anna

      Delete
  2. Thanks sir
    వయసు ఎంత వివరణ ఇవ్వగలరు

    ReplyDelete
    Replies
    1. పూర్తి వివరాలు రేపు చెప్తాము అని అన్నారు మంత్రి గారు

      Delete

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..