FCI Recruitment 2023: FCI లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ .. వేతనం రూ.60వేలకు పైగా..

 ఫుడ్ కొర్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 46 పోస్టులను భర్తీ చేయనున్నారు


అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AE), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (EM) ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్(FCI Job Notification) ద్వారా మొత్తం 46 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు FCI అధికారిక వెబ్‌సైట్ fci.gov.inలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 03, 2023లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ డిప్యూటేషన్ ప్రాతిపదికన జరుగుతోంది. ఎంపికైన అభ్యర్థులు 03 సంవత్సరాల పదవీకాలానికి నియమిస్తారు. దానిని 5 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.


FCI ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AE)  :  26

2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (EM) :   20

                       మొత్తం పోస్టుల సంఖ్య:  46



అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AE): అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి. కనీసం 05 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు.


అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (EM): అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్ లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి. E-3 లేదా L-11 గ్రేడ్‌లో సారూప్యమైన పోస్ట్‌/ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులలో కనీసం 05 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.


 కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                 

                        

       


వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ. 60,000- 1,80,000 ఇవ్వబడుతుంది.

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ( OFFLINE) 


 అభ్యర్థుల కోసం ఇతర సమాచారం:

పూర్తి చేసిన దరఖాస్తును డిప్యూటీ జనరల్ మేనేజర్ (Estt-I), ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హెడ్‌క్వార్టర్స్, 16-20 బరాఖంబ లేన్, న్యూ ఢిల్లీ-110001కి చివరి తేదీలో  చిరునామాలో పంపించాల్సి ఉంటుంది


దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..👇🏼👇🏼




Comments

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..