Posts

Showing posts from April, 2022

పోలీసు ఉద్యోగాల రాత‌ప‌రీక్ష‌లో.. క‌రెంట్ అఫైర్స్‌, జీకే పాత్ర‌

Image
తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే 17000 ఉద్యోగాల‌కు పైగా పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ రానున్న‌ది. ఈ నేప‌థ్యంలో.. పోలీసు ఉద్యోగాల రాతప‌రీక్ష‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. తీవ్ర పోటీ ఉన్న ఈ పరీక్షలో విజయం సాధించాలంటే.. జీకేతో పాటు వర్తమాన వ్యవహరాలపై దృష్టిసారించాలి. జీకేకు సంబంధించి చదవాల్సిన అంశాలు ఇవే.. భారతదేశ జాతీయ చిహ్నాలు, కేలండర్, జనాభా, భాషలు, రాష్ట్రాలు, రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాలు, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, సమాచార వ్యవస్థ, దేశ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థ, భారత అంతరిక్ష విజయాలు, అణుశక్తి రంగం, అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు, అవి నెలకొని ఉన్న ప్రదేశాలు, భారత భౌగోళిక అంశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, భారత రాజ్యాంగంలోని ముఖ్యాంశాలు. ➤ రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, న్యాయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు, బ్యాంకింగ్ వ్యవస్థ, ఉపాధి కల్పనా పథకాలు, వ్యవసాయ రంగం తదితర అంశాలపై దృష్టిసారించాలి. ➤ అంతర్జాతీయ అంశాలలో దేశాలు, రాజధానులు, కరెన్సీలు, పార్లమెంటు పేర్లు, వివిధ దేశాల జాతీయ చిహ్

నిరుద్యోగులకు ఊరట || TSPCS కీలక నిర్ణయం

Image
రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80,000 ఉద్యోగాలకు పైగా ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించింది .  ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ( TSPSC ) వద్ద ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ ( ఓటీఆర్ ) చేసుకున్న 25 లక్షల మంది నిరుద్యోగుల్లో అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య .  తాజా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థుల స్థానికతను గుర్తించేందుకు ఉద్యోగాల నోటిఫికేషను ముందే టీఎస్పీఎస్సీ ఈ ప్రక్రియను ప్రారంభించింది . 1 7 తరగతుల్లో చివరి నాలుగేళ్లు ( 4-7 తరగతులు ) చదివిన జిల్లానే స్థానికంగా పరిగణిస్తారు . గతంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో లోకల్ , నాన్కల్ అని కేవలం ప్రస్తావించేవారు . ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉండేది . ఈసారి ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సమర్పించాల్సి రావడం , స్థానికతను గుర్తించేందుకు బోనఫైడ్ సర్టిఫికె ట్లే కొలమానం కావడంతో వీటి కోసం నిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు . అభ్యర్థులకు ఊరట ...  ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకొంది . వన్లైం రిజిస్ట్రేషన్ ( ఓటీఆర్ ) లో సర్టిఫికెట్ల అప్డేషన్ తప్పనిసరి కాదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది . ఈ మేరకు వెబ్సైట్లో మార్పు

ఇండియా పోస్ట్ లో ఖాళీలు..

Image
ప్రభుత్వరంగ సంస్థ  భారత అయిన ముంబయిలోని ఇండియా పోస్ట్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .  మొత్తం ఖాళీలు : 09  పోస్టులు : స్కిల్డ్ ఆర్టిసన్  పోస్టులు విభాగాలు : జనరల్  సెంట్రల్ సర్వీస్ , గ్రూప్ సి , నాన్ గెజిటెడ్ , నాన్ మినిస్టీరియల్  ట్రేడులు : మెకానిక్ , ఎలక్ట్రిషియన్ , టైర్మెన్ తదితరాలు  అర్హత : సంబంధిత స్పెషలైజేషన్ ను అనుసరించి 8 వ తరగతి / ఐటీఐ ఉత్తీర్ణత . సంబంధిత పోస్టును అనుసరించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి  జీతభత్యాలు : నెలకు రూ .19,900 చెల్లిస్తారు . ఉండాలి .  ఎంపిక : ట్రేడ్ టెస్ట్ , డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది .  దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా  దరఖాస్తుకు చివరి తేదీ : మే 5 వెబ్సైట్ : https://www.indiapost.gov.in  

ECIL Hyderabad Recruitment || ఐటీఐ అర్హత‌తో 1625 పోస్టులు..

Image
  హైదరాబాద్‌లోని   ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌)   నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన   జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుల   భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 1625 ట్రేడుల వారీగా ఖాళీలు :  ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌–814, ఎలక్ట్రీషియన్‌–184, ఫిట్టర్‌–627. అర్హత:  మెకానిక్‌/ఎలక్ట్రీషియన్‌/ఫిట్టర్‌ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు:  31.03.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం:  మొదటి ఏడాది నెలకు రూ.20,480, రెండో ఏడాది నెలకు రూ.22,528, మూడో ఏడాది నెలకు రూ.24,780 చెల్లిస్తారు. ఎంపిక విధానం:   ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని హైదరాబాద్‌లో నిర్వహించే డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:  11.04.2022 వెబ్‌సైట్‌:  https://www.ecil.co.in/

పదో తరగతితో ఆర్మీ ఇన్ స్టిట్యూట్ జాబ్స్

Image
ఆర్మీ ఇన్ స్టిట్యూట్ జాబ్స్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని గువాహటికి చెందిన ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ( ఏఐఎన్ ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .  మొత్తం ఖాళీలు : 16  పోస్టులు : అసోసియేట్ ప్రొఫెసర్లు , అసిస్టెంట్ ప్రొఫె సర్లు , ట్యూటర్ , అకౌంటెంట్ , క్లర్క్  అర్హత : పదో తరగతి , సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ / హెచ్ఎస్ / గ్రాడ్యుయేషన్ / బీసీఏ / బీఎస్సీ / ఎంసీఏ / ఎ మ్మెస్సీ ఉత్తీర్ణత .  జీతభత్యాలు : నెలకు రూ .10,580 నుంచి రూ .48,000 వరకు చెల్లిస్తారు  ఎంపిక విధానం : షార్ట్ స్టింగ్ , ఇంటర్వ్యూ ఆధారంగా  దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా  దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 8  వెబ్సైట్ : https://ainguwahati.org/

టెట్ బెస్ట్ స్కోర్ సాధించడమెలా ?

Image
బోధన అనేది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే పవిత్ర కార్యం ' . ఇట్టి పవిత్ర కార్యాన్ని నిర్వర్తించడానికి అధిగమించాల్సిన మొదటి మెట్టు టెట్ . రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది . ఈ నేపథ్యంలో టెట్లో బెస్ట్ స్కోర్ సాధించడమెలాగో తెలుసుకుందాం . • విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి , ఎన్సీ టీఈ నిబంధనల మేరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయా లంటే టెట్ ( టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) లో అర్హత సాధించడం తప్పనిసరి  • డీఎస్సీ సాధనలో టెట్ పాత్ర : గతంలో టెట్ రాసిన అభ్యర్థులు స్కోరు పెంచుకోవడం కోసం మళ్లీ రాయాలి . టెట్ను కేవలం అర్హత పరీక్షగా మాత్రమే కాకుండా పోటీ పరీక్షగా భావించాలి . టెట్ పొందే ప్రతి మార్కు డీఎస్సీలో ర్యాంకును మెరుగుపరుస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దు . ఉపాధ్యాయ కల నెరవేరాలంటే టెట్లో మంచి స్కోర్ సాధించాలి .  • సిలబస్ అనాలసిస్ చైల్డ్ డెవలప్మెంట్ ( సైకాలజీ ) లో పెరుగు దల వికాసం , వికాస నియమాలు , అభ్యసన సిద్ధాంతాలు , వైయక్తిక భేదాలు , మూర్తి మత్వం , పెడగాగీకి సంబంధించిన విద్యా హక్కు చట్టం , జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం మొదలైనవి అవగాహనాత్మకంగా అధ్య యనం చేయ