Posts

Showing posts from October, 2023

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. విద్యార్హత డిగ్రీ

Image
  సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. స్పెషలిస్ట్ కేటగిరీలో ఆఫీసర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 192 ఖాళీలను బర్తీ చేయనున్నారు.   దేశ వ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో వేర్వేరు స్ట్రీమ్స్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. హ్యూమన్ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్ ఈ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 192 ఖాళీలకు గాను.. ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌ కేటగిరీ) స్కేల్‌ I: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(15), రిస్క్‌ మేనేజర్‌(2), సెక్యూరిటీ ఆఫీసర్‌(15), లైబ్రేరియన్‌(1) చొప్పున పోస్టుల్ని భర్తీ చేయనుండగా.. స్కేల్‌ -2లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(73), లా ఆఫీసర్‌(15), క్రెడిట్‌ ఆఫీసర్‌(50), ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌(4), సీఏ -ఫైనాన్స్‌/అకౌంట్స్‌/జీఎస్టీ/ Ind AS/బ్యాలెన్స్‌ షీట్‌/ట్యాక్సేషన్‌ (3); స్కేల్‌ IIIలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (6), ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌ (5), స్కేల్‌ IV రిస్క్‌మేనేజర్‌ (1); స్కేల్‌ Vలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (1), రిస్క్‌ మేనేజర్‌ (1) చొప్పు ఉన్నాయి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ మిధానిలో భారీగా ఉద్యోగాలు..

Image
హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని మిశ్రధాతు నిగం లిమిటెడ్‌(మిధాని) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది....   దీనిద్వారా మొత్తం 54 ఖాళీలను భర్తీచేయనున్నారు. పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు నవంబరు 1లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష, ట్రేడ్ టెస్టుల ఆధారంగా ఎంపికచేస్తారు. వివరాలు.... * ఖాళీల సంఖ్య: 54 ➥ జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఫిట్టర్): 13 పోస్టులు ➥ జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (వెల్డర్): 02 పోస్టులు ➥ జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్): 06 పోస్టులు ➥ సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెటలర్జీ): 20 పోస్టులు ➥ సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెకానికల్): 10 పోస్టులు ➥ సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 03 పోస్టులు అర్హత:   పదో తరగతి, సంబంధిత ట్రేడ్/ విభాగంలో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి:  18.10.2023 నాటికి జేవోటీ పోస్టు

డిగ్రీ అర్హ‌త‌తో.. ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

Image
  ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్ త‌దిత‌ర విభాగాల‌లో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ లిమిటెడ్) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది..... ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) అర్హ‌త సాధించి ఉండాలి. గేట్‌-2023 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడిక‌ల్ టెస్ట్ త‌దిత‌రాలు ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభంకాగా అక్టోబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు... మొత్తం పోస్టులు :  495 పోస్టులు :  ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అర్హ‌త‌లు :  కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) అర్హ‌త సాధించి ఉండాలి. విభాగాలు :  ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్ త‌దిత‌రాలు. ఎంపిక :  గేట్‌-2023 స్కోరు, డాక్యుమెంట్ వె

ఇంట‌ర్, డిగ్రీ అర్హతతో.. 909 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు....

Image
  ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అటెండెంట్,  త‌దిత‌ర పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి న్యూఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ కళావతి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్లు సంయుక్తంగా ప్ర‌క‌టన విడుద‌ల చేశాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 909 భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, ఇంట‌ర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభంకాగా అక్టోబ‌ర్ 25 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. మొత్తం పోస్టులు : 909 పోస్టులు :  ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అటెండెంట్, త‌దిత‌రాలు... జీతము :- లెవెల్ -1 ఉద్యోగాలకు 18

జిల్లా జైలులో డ్రైవర్ పోస్ట్ లు..

Image
  జిల్లా జైలు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డ్రైవర్ పోస్ట్ లు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..... దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటి గురించిన సమాచారం ఇక్కడ ఉంది.... ఖాళీల వివరాలు.. డ్రైవర్ పోస్ట్ లు:- 2 అర్హత 10వ తరగతి,ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.18,500 వయోపరిమితి  18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.... దరఖాస్తకు చేయడానికి చివరి తేదీ 16-10-2023 దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ దరఖాస్తులను సూపరింటెండెంట్ కార్యాలయం,జిల్లా జైలు,తాలూకా కాంపౌండ్,బ్రాడీపేట్,గుంటూరు -    522002. చిరునామాకి పంపాలి   కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు ..                                                                        

తెలంగాణ జెన్‌కోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల...

Image
  హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (TSGENCO) .. ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల సంస్థ యాజమాన్యం ప్రకటన జారీచేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఇంజనీరింగ్‌, సివిల్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 29, 2023వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ జెన్‌కో సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలతోపాటు పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాలలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఖాళీల వివరాలు మొత్తం అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు 339 వరకు ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే.. లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌లో ఖాళీలు: 94 జనరల్ రిక్రూట్‌మెంట్‌లో ఖాళీలు: 245 అర్హతలు ఏమేమి ఉండాలంటే... ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్