Posts

Showing posts from December, 2022

Degree Scholarship:5000 మంది డిగ్రీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్....

Image
  ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న విద్యార్థులకు అలర్ట్. డిగ్రీ విద్యార్థులకు  రిలయన్స్ ఫౌండేషన్  (Reliance Foundation) స్కాలర్‌షిప్స్ అందిస్తోంది.  రిలయన్స్  అండర్‌గ్రాడ్యుయేట్   స్కాలర్‌షిప్  (Undergraduate Scholarship) ప్రోగ్రామ్ కింద 5,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ ప్రకటించింది. ప్రతిభగల విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ఈ స్కాలర్‌షిప్ ఉపయోగపడుతుంది. రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 2023 ఫిబ్రవరి 14 లోగా దరఖాస్తు చేయాలి. మరి ఈ స్కాలర్‌షిప్ విద్యార్హతలు, ఇతర వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసే విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.15 లక్షల లోపే ఉండాలి. ఏదైనా విభాగంలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్స్ చదువుతూ ఉండాలి. డిగ్రీ మొదటి సంవత్సరంలో చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఫుల్ టైమ్ అం

TSPSC Group -4 Applications: నిరుద్యోగులకు షాకిచ్చిన టీఎస్‌పీఎస్సీ,.. ఆలస్యంగా ప్రారంభమైన గ్రూప్ – 4 దరఖాస్తులు.. తగ్గిన పోస్టులు..

Image
  నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న  గ్రూప్ – 4  ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.  నిన్న ( డిసెంబర్ 30 ) న ప్రారంభం కావాల్సిన దరఖాస్తులు.. చాలా ఆలస్యంగా రాత్రి 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. అప్లికేషన్ చేసే సమయంలో టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కమిషన్ అధికారులు వెల్లడించారు. దీంతో దరఖాస్తుల ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ప్రక్రియలన్నీ సకాలంలో పూర్తయ్యేలా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి పర్యవేక్షించారు. గ్రూప్‌ 4 కు తొలుత 9,168 పోస్టులతో ప్రకటన వెలువడింది. అయితే తాజాగా రూపొందించిన వెబ్‌సైట్‌లో సమగ్ర ప్రకటనలో 8,039 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే 1129 తగ్గడం గమనార్హం కాగా.. డిసెంబర్ 23 నుంచి ప్రారంభం కావాల్సిన అప్లికేషన్లు వాయిదా పడ్డాయి. శుక్రవారం రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చాయి. అన్ని డిపార్ట్​మెంట్ల నుంచి పూర్తి స్థాయి సమాచారం రాకపోవడంతో టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని 97 హెచ్ఓడీల పరిధిలో 9,168 పోస్టుల భర్తీని టీఎస్పీఎస్సీకి అప్పగిస్తూ నవంబర్ 25న ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. దీంట్లో జూనియర్‌ అ

Agriculture Officer Posts: తెలంగాణలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు, జీతం రూ.1,27,310/-

Image
   తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీనిద్వారా మొత్తం 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పోస్టుల వివరాలు... * అగ్రికల్చర్ ఆఫీసర్ ఖాళీల సంఖ్య:  148 (మల్టీజోన్-1: 100, మల్టీజోన్-2: 48) అర్హత:  బీఎస్సీ (అగ్రికల్చర్)/ బీఎస్సీ(ఆనర్స్)అగ్రికల్చర్ అర్హత ఉండాలి. వయోపరిమితి:   01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.  దరఖాస్తు విధానం:   ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు ఫీజు:   రూ.320. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.120 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు

కేంద్ర రాష్ట్రాల మద్య పరిపాలనా సంబందాలు తెలియ జేసే ఆర్టికల్స్ ఏవి?

Image
 * భారత సమాఖ్య - కేంద్రరాష్ట్ర సంబంధాలు * 1..సమాఖ్య విధానం ముఖ్య లక్షణం? (A)   అధికారలన్ని కేంద్రం చేతిలో ఉండటం (B)   రాష్ట్రాలకే అన్ని అధికారాలు ఉండటం (C)   రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణి (D)    కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన పంపిణి [Ans: d] Explanation: రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వాధికారాలు కేంద్ర రాష్ట్రాల మద్య పంపిణి అయిన ఉన్న ప్రభుత్వ విధానమే సమాఖ్య విదానం 2. "సమాఖ్య" ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ఏర్పడతాయి. (A)   3 పద్దతులు (B)   4 రకాలుగా (C)    2 రాకాలుగా (D)   ఒకేవిదంగా [Ans: c] Explanation: "సమాఖ్య" రెండు రకాలుగా ఏర్పడుతుంది 1 రాష్ట్రాల కలయిక వల్ల ఏర్పడే సమాఖ్య, 2 విచ్చిత్తి ప్రక్రియవల్ల ఏర్పడే సమాఖ్య. 3. భారత సమాఖ్య ఏ విదంగా ఏర్పడింది? (A)   ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్ (B)   ఫెడరేషన్ బై డిస్ ఇంటిగ్రేషన్ (C)    A మరియు B (D)   ఏదికాదు [Ans: c] Explanation: 1947 వరకు వేరుగా ఉన్న 563 సంస్థానాలు భారత్ కలవడం Fedaration by Integration, పెద్ద రాష్ట్రాలను పాలనా పరంగా చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం 1956 SRC ద్వారా రాష్ట్రాల ఏర్పాటు చేయడం అనగా Fedaration by disintegra

నేటి నుంచే 9,168 'గ్రూప్‌-4' ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు! చివరితేది ఎప్పుడంటే?

Image
డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.  సరైన అర్హతలున్నవారు జనవరి 19 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చేఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. వాస్తవానికి డిసెంబరు 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల వారంపాటు వాయిదావేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సరైన అర్హతలున్నవారు జనవరి 19 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.  గ్రూప్-4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి.  వీటిలో కేటగిరీ-1లో జూనియర్ అకౌంటెంట్-429 పోస్టులు,  కేటగిరీ-2లో  జూనియర్ అసిస్టెంట్: 6,859

జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి త్వరలో కొత్త నోటిఫికేషన్! ఈసారి ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారంటే?

Image
ఈ ఏడాది మే నెలలో 1000 జేఎల్‌ఎం పోస్టుల నియామకానికి జులైలో రాతపరీక్షను సైతం నిర్వహించిన తర్వాత పేపర్ లీకేజీ కారణంగా నోటిఫికేషన్‌ను ఆగస్టులో రద్దుచేశారు. కొత్త నోటిఫికేషన్‌లో 1300 పోస్టులు ఉండే అవకాశం.      తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో జూనియర్ లైన్‌మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో 1000 జేఎల్‌ఎం పోస్టుల నియామకానికి జులైలో రాతపరీక్షను సైతం నిర్వహించిన తర్వాత పేపర్ లీకేజీ కారణంగా నోటిఫికేషన్‌ను ఆగస్టులో రద్దుచేశారు. అప్పటి నుంచి ఉద్యోగార్థులు కొత్త నోటిఫికేషన్‌కు ఎదురుచూస్తున్నారు.  అయితే జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి సంబంధించిన త్వరలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈసారి 1000 పోస్టులు కాకుండా.. కొత్త నోటిఫికేషన్‌లో మొత్తం 1300 పోస్టులు ఉండొచ్చని అధికారులు అంటున్నారు. డిస్కం పరిధిలో ఏడాదికాలంలో కొత్త విద్యుత్తు ఉపకేంద్రాలు పెరగడం.. కొత్తగా పలు సెక్షన్లు ఏర్పాటు కాబోతుండటంతో ఆ మేరకు పోస్టుల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ఐటీఐ ఎలక్ట్రికల్, వైర్‌మెన్,

తెలంగాణలో 783 గ్రూప్‌-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Image
  తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్  (TSPSC Group-2) విడుదలైంది.  మొత్తం 783 గ్రూప్-2 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు  టీఎస్పీఎస్సీ  (TSPSC) ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 18 నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి కొద్ది సేపట్లో ఇందుకు సంబంధించిన పూర్తి  నోటిఫికేషన్  (TSPSC Notification) విడుదల కానుంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 16 వరకు గడువు ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఆ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలు, నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం కమిషన్ వెబ్ సైట్  https://www.tspsc.gov.in/  ను సందర్శించాలని టీఎస్పీఎస్సీ సూచించింది. 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం  కేసీఆర్  ప్రకటన మేరకు.. రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఆయా నియామక సంస్థలు విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా  తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  (TSPSC) నుంచి నిత్యం ఏదో ఓ నోటిఫికేషన్ గురించి అప్డేట్స్ వస్తున్నాయి. నిన్న కూడా మరో రెండు జాబ్  నోటిఫికేషన్లను  (TSPSC Job Notifications) విడుదల చేసింది. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులతో పాటు, ఫి

తెలంగాణలో భారీగా పెరిగిన మెడికల్ సీట్లు, దేశంలో ఆరో స్థానం!

Image
  తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యకు ప్రాధాన్యమివ్వడంతో గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది.  తెలంగాణ ఏర్పడకముందు ప్రభుత్వ వైద్య కళాశాలలు అయిదు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఆవిర్భవించాక.. తొలి దశలో 4 కళాశాలలు, రెండో దశలో ఈ ఏడాది (2022-23) నుంచి మరో 8 కళాశాలలను ప్రారంభించారు. వీటి ద్వారా 1,150 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను కొత్తగా నెలకొల్పడం, మెడికల్ సీట్ల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించడంతో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది.  సీట్ల సంఖ్య 6,040 కి చేరింది. తెలంగాణకు ముందు తమిళనాడు (10,825), కర్ణాటక (10,745), మహారాష్ట్ర (9,995), ఉత్తర్ ప్రదేశ్ (9,053), గుజరాత్ (6,200) రాష్ట్రాలు మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5,485 ఎంబీబీఎస్ సీట్లతో ఏడో స్థానంలో నిలిచింది.  ఇక అతి తక్కువ వైద్యసీట్లున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్రిపుర (225), గోవా(180), చండీగఢ్ (150), సిక్కిం (150), దాద్రా నగర్ హవేలీ (15

చివరి అవకాశం.. ఎస్‌బీఐ పోస్టుల దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు.

Image
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ముంబయిలోని కార్పొరేట్‌ సెంటర్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెక్నీకల్‌ డిగ్రీ పూర్తి చేసి వారు ఈ పోస్టులకు అర్హులు. ఇక ఈ ఖాళీలను ఎస్‌బీఐ రెగ్యులర్‌/కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇదలా ఉంటే దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నేటితో (29-12-2022)తో ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంంటుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. sbi భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.. * నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో డిప్యూటీ మేనేజర్(డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్) (06), డిప్యూటీ మేనేజర్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్) (02), డిప్యూటీ మేనేజర్(జావా డెవలపర్) (05), డిప్యూటీ మేనేజర్(డబ్ల్యూఏఎస్‌ అడ్మినిస్ట్రేటర్) (03), సీనియర్ ఎగ్జిక్యూటివ్(ఫ్రంటెండ్ యాంగ్యులర్ డెవలపర్) (03), సీనియర్ ఎగ్జిక్యూటివ్(పీఎల్‌ & ఎస్‌క్యూఎల్‌ డెవలపర్) (03), సీనియర్ ఎగ్జిక్యూటివ్(జావా డెవలపర్) (10), సీనియర్ ఎగ్జిక్యూటివ్(టెక్నికల్ సపోర్ట్) (01), ఎగ్జిక్యూటివ్(

వరంగల్‌ 'నిట్'లో 100 టీచింగ్ ఫ్యాకల్టీలు, పోస్టుల వివరాలు ఇలా! అర్హతలివే! ఇలా అప్లై చేసుకోండి

Image
  దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో వరంగల్ లోని  నిట్  (నేషనల్ ఇనిస్ట్యూట్ ఇఫ్ టెక్నాలజీ) ఒకటన్న విషయం తెలిసిందే. ఈ పేరొందిన విద్యాసంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.  వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 27న ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది.  వివరాలు.. మొత్తం ఖాళీలు: 100 పోస్టుల కేటాయింపు:  జనరల్-38, ఈడబ్ల్యూఎస్-18, ఓబీసీ-26, ఎస్సీ-10, ఎస్టీ-08. పోస్టుల వారీగాఖాళీలు.. ➥ ప్రొఫెసర్: 12 ➥ అసోసియేట్ ప్రొఫెసర్: 52.  ➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-I): 13. ➥అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-II): 14. ➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-II): 9. విభాగాలవారీగా ఖాళీలు:  సివిల్ ఇంజినీరింగ్ - 16, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 06, మెకానికల్ ఇంజినీరింగ్ - 05, ఈసీఈ - 1

బీటెక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 596 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.

Image
బీటెక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 596 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.  ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 596 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.aai.aero ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 21 జనవరి 2023. ఖాళీల వివరాలు మొత్తం పోస్ట్‌లు - 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్ - సివిల్) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చరల్) విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ – 22 డిసెంబర్ 2022 దరఖాస్తు చేయడానికి చివరి తేదీ - 21 జనవరి 2023 అర్హతలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి వయో పరిమితి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది. దరఖాస్తు ఫీజు..

నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.1.50 లక్షల వేతనంతో ఉద్యోగాలు..

Image
నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. నెలకు రూ.1.50 లక్షల వేతనంతో ఉద్యోగాలు.. జపాన్ లో(Japan) నర్సింగ్ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి  తెలంగాణ రాష్ట్ర విదేశీ మానవ వనరుల సంస్థ(టామ్‌కామ్‌) దరఖాస్తులు కోరుతోంది. దీనిలో నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమాలో ఉత్తీర్ణులైన వారికి శిక్షణ ద్వారా విదేశీ ఉద్యోగాలను కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. అభ్యర్థుల యొక్క వయస్సు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. అయితే వీటికి సంబంధించి మొదటి విడత ఎంపిక పూర్తి కాగా.. డిసెంబర్ 27 నుంచి వారికి టీఎస్ఐఆర్డీ(TSIRD),  రాజేంద్రనగర్ , హైదరాబాద్ లో శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. అంటే ఈ రోజు  నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభం అవుతుంది విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు ఉండాల్సిన అర్హతలపై అవగాహన, శిక్షణ ఈ ప్రోగ్రామ్ లో కల్పించనున్నారు. దీనిలో జపనీస్ భాషపై శిక్షణతో పాటు ఇతర వృత్తిపరమైన నైపుణ్యాలను కల్పించనున్నారు. రెండో విడత దరఖాస్తుల్లో భాగంగా.. దరఖాస్తులు సమర్పించిన వారికి రేపు (డిసెంబర్ 27) స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక

పదో తరగతి పాసైన వారికి తెలంగాణలో రేషన్‌ డీలర్‌ ఉద్యోగాలు

Image
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి    27 చౌకధరల దుకాణం డీలర్ పోస్టులు  ఆదిలాబాద్‌ జిల్లా రెవెన్యూ డివిజన్‌ పరిధిలో.. 27 చౌకధరల దుకాణం డీలర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత గ్రామ పంచాయితీలో నివాసి అయ్యి ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో జనవరి 6, 2023వ తేదీలోపు ఆదిలాబాద్‌ ఆర్‌డీవో కార్యాలయంలో అందజేయాలి దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష జనవరి 22వ తేదీన నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ జనవరి 27న ఉంటుంది. రాత పరీక్ష 80 మార్కులకు , ఇంటర్వ్యూ 20 మార్కులకు కలిపి మొత్తం 100 మార్కులకు నియామక ప్రక్రియ ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్‌ చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌ కోసం  క్లిక్‌ చేయండి. పూర్తి సమాచారం కోసం  క్లిక్ చేయండి.

ఎస్బీఐలో రెగ్యూలర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు..

Image
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం SBIలో 54 ఉద్యోగాలు భర్తీ చేయబడతాయి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థి అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 29 డిసెంబర్ 2022. SBI నిర్వహించే ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద.. 54 పోస్ట్‌లను రిక్రూట్ చేస్తారు ఇందులో రెగ్యులర్ మరియు కాంట్రాక్టు పోస్టులు ఉంటాయి. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద.. రెగ్యులర్ స్థానాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో హాజరు కావాలి.  అదే సమయంలో, కాంట్రాక్ట్ పోస్ట్‌పై అభ్యర్థుల నియామకం కోసం.. వారు ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు. అభ్యర్తులు డిగ్రీ, పీజీతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ / EWS / OBC కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 750 చెల్లించాలి.

తెలంగాణలో ఇనుప ఖనిజాల నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం?

Image
  ప్రాక్టీస్‌ బిట్స్‌ 1. ఖనిజ వనరుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? 1) మెటీరియాలజీ 2) మినరాలజీ 3) పెడాలజీ 4) ఓరాలజీ 2. 2017-18 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఖనిజ రంగం వాటా ప్రస్తుత ధరలలో ఎంత? 1) 4.3 శాతం 2) 2.3 శాతం 3) 3.4 శాతం 4) 5.3 శాతం 3. కింది వాటిలో ఇంధన ఖనిజం కానిది? 1) పెట్రోలియం 2) బొగ్గు 3) సహజ వాయువు 4) థోరియం 4. తెలంగాణలో ఇనుప ఖనిజాల నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం? 1) బయ్యారం 2) ఏటూరునాగారం 3) అచ్చంపేట 4) మణుగూరు 5. తెలంగాణలో అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేసే జిల్లా? 1) జయశంకర్‌ భూపాలపల్లి 2) మంచిర్యాల 3) కరీంనగర్‌ 4) భద్రాద్రి కొత్తగూడెం 6. భారతదేశంలో మొదటగా యురేనియం నిల్వలు గుర్తించిన ప్రాంతం? 1) సింగ్భం 2) జాదుగూడ 3) లంబాపూర్‌ 4) ఏదీకాదు 7. తెలంగాణలో మాంగనీసు అధికంగా విస్తరించి ఉన్న జిల్లా? 1) హనుమకొండ 2) కరీంనగర్‌ 3) ఆదిలాబాద్‌ 4) నాగర్‌కర్నూలు 8. రాష్ట్రంలో సున్నపురాయిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా? 1) రంగారెడ్డి 2) సూర్యాపేట 3) ఖమ్మం 4) మహబూబాబాద్‌ 9. కింది వాటిలో లోహ ఖనిజం కానిది? 1) రాగి 2) వెండి 3) బంగారం 4) ముగ్గురాయి 10. భారతదేశంలో అధికంగా ఇనుమును ఉత్పత్తి చేస్తున